TT Ads

తాడేపల్లి: తాడేపల్లి, కొలనుకొండ, కుంచనపల్లి గ్రామాల్లోని భూములపై ప్రభుత్వం విధించిన జోన్ ఎత్తివేయాలని డిమాండ్.చిన్న, సన్న కారు రైతుల వద్ద భూములు లాక్కుని బడా బాబులకు కట్టబెట్టాలని ప్రభుత్వం చూస్తుంది.గత ప్రభుత్వం 2016 లో 178 ఎకరాల వ్యవసాయ భూమిని రిజర్వు జోన్ గా ప్రకటించింది.వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే జోన్ తొలగిస్తామని హామీ ఇచ్చింది,ప్రభుత్వం మారి 2 ఏళ్ళు గడుస్తున్నా మా సమస్య పరిష్కారం కావటంలేదు.తాడేపల్లి-మంగళగిరి కార్పొరేషన్ గా ప్రకటించినందున నూతన ప్లానులో మా భూములపై ఉన్న జోన్ ఎత్తివేసి, రెసిడెన్షియల్ జోన్ గా నిర్దారించి నూతన మాస్టర్ ప్లాన్ రూపొందించాలని డిమాండ్.ఆర్కే ఎమ్మెల్యే అయిన నెలలోనే U-1 జోన్ రద్దు పరుస్తామని హామీ ఇచ్చారు,ఇప్పడు అదిగో, ఇదిగో అంటూ కాలయాపన చేస్తున్నారు.గత ప్రభుత్వం చేసిన తప్పుకు మాకు అన్యాయం జరిగింది,ఈ ప్రభుత్వం అయినా స్పందించి తమకు న్యాయం చేయాలని విన్నపం.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *