TT Ads

ఖమ్మం : బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్బంగా ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర ఉన్న బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు . అనంతరం TRSKV మున్సిపాల్ స్టేట్ సెక్రెటరీ & KMC ప్రెసిడెంట్ ముత్యాల ఫనింధర్ మాట్లాడుతూ … ఒక సామాన్యమైన రైతు కుటుంబంలో 1908లో ఇదే రోజు బీహార్లోని షాబాద్ – బోజు పూర్ జిల్లా లో నీచందా అనే చిన్న గ్రామంలో జన్మించిన ఆయన అంటరానితనం నిర్మూలన కోసం మహాత్మా గాంధీ తో కలసి , దేశ స్వాతంత్ర పోరాటంలో నూ పాల్గొనడమే కాకుండా సామాజిక న్యాయం కోసం అణగారిన వర్గాల హక్కుల సాధనకు మానవతావాదిగా , ఆదర్శ వాదంతో నైతిక విలువల పై ఆయన ప్రస్థానం అందరికీ ఆదర్శం అయిందని చెప్పారు . ఈ కార్యక్రమం లో TRSKV వర్కర్స్ యూనియన్ ఖమ్మం నగర పాలక సంస్థ జనరల్ సెక్రెటరీ చిలుకూరి సూర్యం బాబు , వైస్ ప్రెసిడెంటు పల్లెపొంగ్ రాజు , ట్రెజరర్ మాడుగుల శ్రీనివాస రావు , జాయింట్ సెక్రెటరీ గుమ్మడి రమేష్ , అర్గనెజెంగ్ సెక్రెటరీ మెట్టు కిరణ , గణేష జ్యోతి , 3 టౌన్ ఇంచార్జి గొల్లమంధల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు .

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *