TT Ads

ఖమ్మం : TRS KV గ్రానైట్ వర్కర్ల యూనియన్ ఆధ్వర్యంలో వేతనాలను పెంచాలని ఖానాపూరo గ్రానైట్ టైల్స్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు తమ్మినేని సాగర్ గారికి వినతిపత్రాన్ని అందజేశారు . ఈ సందర్బంగా ఖానాపురం గ్రానైట్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు కర్నె రాములు మాట్లాడుతూ … నిత్యావసర వస్తువులు వంటగ్యాస్ , పెట్రోల్ , కరెంటు బిల్లులు , ఇంటి అద్దె , విద్య , వైద్యం ధరలు విపరీతంగా పెరుగుతున్న సమయంలో గ్రానైట్ కార్మికులకు వేతనాలు సరిపోక అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారాని , వచ్చే వేతనాలు కుటుంబ పోషణకు పెను భారంగా మారిందని , ప్రస్తుతం పెరిగిన నిత్యావసర ధరలను దృష్టిలో ఉంచుకొని గ్రానైట్ వర్కర్లకు నెలసరి వేతనాలను పెంచాలని గ్రానైట్ ఓనర్స్ అసోసియేషన్ కోరారు . వెంటనే ఓనర్స్ అసోసియేషన్ వారు మీయి న్యాయమైన కోరికలు కానుక త్వరలోనే పరిష్కరిస్తామని అన్నారని తెలిపారు . ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు నాగండ్ల కోటేశ్వరరావు , ప్రధాన కార్యదర్శి చిoతపట్ల నర్సింహారావు , ఉపాధ్యక్షులు సామినేని చలపతిరావు , మద్దెల నరేష్ కుమార్ , కోశాధికారి వేంపల్లి భద్రయ్య , ప్రచార కార్యదర్శి గోకరా నవీన్ , సహాయ కార్యదర్శులు ఎనముల సాయిబాబా , ఆర్గనైజర్ గిరిబోయిన రామారావు తదితరులు పాల్గొన్నారు .

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *