TT Ads

చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ పొలిటికల్ పంచ్ విసరబోతున్నారు. ‘రిపబ్లిక్’ అంటూ స్ట్రాంగ్ కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. దేవకట్టా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు తాజాగా రామ్ చరణ్ సపోర్ట్ అందింది.

వరుస ఫ్లాపుల తర్వాత ‘చిత్రలహరి’ సినిమాతో తిరిగి ట్రాక్ ఎక్కిన మెగా మేనల్లుడు ”ప్రతి రోజూ పండుగే, సోలో బ్రతుకే సో బెటర్” వంటి సినిమాలతో వరస హిట్స్ అందుకొని సూపర్ ఫామ్ కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే ‘రిపబ్లిక్’ అంటూ మరో డిఫరెంట్ కథతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు సాయి తేజ్. తాజాగా ఈ మూవీ ఫస్ట్‌లుక్ రిలీజ్ చేశారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ.

‘రిపబ్లిక్’ కాన్సెప్ట్ పోస్టర్ తెలుగు ప్రేక్షకుల్లో సినిమా పట్ల క్యూరియాసిటీని పెంచింది.పొలిటికల్ నేపథ్యంలో ఆశక్తికార అంశాలు జోడించి ఈ సినిమా రూపొందిస్తున్నారు డైరెక్టర్ దేవకట్టా.  

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *