TT Ads

CPM పార్టీ అభ్యర్థి కాంపాటి వెంకన్న గెలుపు కోరుతూ ఈరోజు భారీ ర్యాలీ స్థానికుడు, యువకుడు పలు సందర్భాల్లో ప్రజా ఉద్యమాలతో పాటు పలు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన 43వ డివిజన్ కాంగ్రెస్ టిడిపి బలపరిచిన CPM పార్టీ అభ్యర్థి కాంపాటి వెంకన్న ను గెలిపించాలని CPM , కాంగ్రెస్ జిల్లా నాయకులు నున్నా నాగేశ్వరరావు, పోట్ల నాగేశ్వరరావు కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నగరంలో చాలా ప్రజా సమస్యలు పరిష్కారం చేయడంలో TRS విఫలం అయ్యింది అని విమర్శించారు. డబుల్ బెడ్ రూం ఇళ్ళు, పెన్షన్లు, రేషన్ కార్డులు , అండర్ డ్రైనేజీ, రహదారులు వెడల్పులు, శివారు ప్రాంతాల్లో అభివృద్ధిలో నిర్లక్ష్యం , ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయకపోవడం తదితరు సమస్యలు పరిష్కారం చేయడంలో TRS పూర్తిగా విఫలం అయ్యింది అని విమర్శించారు. కాంపాటి వెంకన్న గుర్తు సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుకే ఓటు వేయాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో నాయకులు కళ్యాణం వెంకటేశ్వరరావు, వై విక్రమ్, గౌస్, భద్రం తదితరులు పాల్గొన్నారు

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *