ఖమ్మం : జిల్లా కేంద్ర గ్రంథాలయంలో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్థంతి సందర్భంగా గ్రంథాలయ కార్యదర్శి ఏ మంజువాణి జయశంకర్ గారి చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు . తెలంగాణ ఉద్యమానికి తన జీవితాన్ని అంకితం చేసి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఏర్పాటులో కె.చంద్రశేఖరరావు గారికి సలహాదారుగా మార్గదర్శిగా వెన్నంటి నిలిచి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతపై పలు పుస్తకాలు రచించి , జయశంకర్ సార్ నాన్ ముల్కీ ఉద్యమంలో సాంబార్ , ఇడ్లీ గోబ్యాక్ ఉద్యమంలో కూడా పాల్గొని తెలంగాణ , ఆంధ్ర రాష్ట్రాల విలీనాన్ని వ్యతిరేకిస్తూ … విద్యార్థి నాయకుడిగా ఆయన ఫజల్ అలీ కమిషన్‌కు నివేదిక ఇచ్చాడని తెలిపారు . ఈ కార్యక్రమంలో గ్రంధాలయసంస్థ సిబ్బంది జె.భాస్కర్ , వి.అఖిల్ , ఆర్.నాగన్న , కె. విజయకుమారి , ఎ. కనకవల్లి తదితరులు పాల్గొన్నారు

వైరా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు ఎమ్మెల్యే రాములు నాయక్ జన్మదిన మరియు పెళ్లిరోజు వేడుకల సందర్భంగా క్యాంపు కార్యాలయం నందు మొక్కలు నాటి నిరుపేదలకు చీరల పంపిణీ చేసిన ఎమ్మెల్యే రాములు నాయక్

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా నుంచి కోలుకొని డిశ్ఛార్జి అయ్యేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ రోజు ఉదయం 9 వరకు అందిన లెక్కల ప్రకారం గత 24 గంటల్లో 7,504 మంది ఆస్పత్రుల నుంచి డిశ్ఛార్జి అయ్యారు. మొత్తంగా 55,002 పరీక్షలు చేయగా 2,620 మంది కరోనా పాజిటివ్‌ అని తేలింది. గత 24 గంటల్లో కరోనాతో 44 మంది మృత్యువాతపడ్డారు.

అమరావతి:సంగం డెయిరీ కేసుపై హైకోర్టులో విచారణ.సంగం డెయిరీలో ప్రభుత్వ ఆస్తులు ఉన్నాయని వాదనలు వినిపించిన ఏజీతమకు సోదాలు నిర్వహించుకునేలా ఆదేశాలు ఇవ్వాలని కోరిన ఏజీ.తాము ప్రభుత్వానికి సహకరిస్తామని తెలిపిన ధూళిపాళ్ల తరుపు న్యాయవాదితదుపరి విచారణ హైకోర్టు ఈనెల 28కు వాయిదా వేసిన ధర్మాసనం

సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ ఆపరేషన్ లో అక్రమంగా బ్లాక్ ఫంగస్ ఇంజక్షషన్స్ అమ్ముతున్న గ్యాంగ్ పట్టివేత.ఫంగస్ ఇంజెక్షన్ అక్రమ వ్యాపారం పై చాలా ఫిర్యాదులు వచ్చాయి.8వేల ధర ఉన్న ఇంజెక్షన్స్ ను 50వేల వరకు అమ్ముతున్నారు.పోలీసుల ఆపరేషన్ లో ముగ్గురు నిందితులు అరెస్ట్- 36 ఇంజెక్షన్స్ సీజ్.నిందితులు క్రాంతి కుమార్, వెంకట్ దినేష్, శ్రీనివాస్ గా గుర్తింపు.హైదరాబాద్ సీపీ పరిధిలో ఫంగస్ పై 58 కేసులు బుక్ కాగా 138 అరెస్ట్- 450 ఇంజెక్షన్స్ సీజ్.ఫంగస్ అక్రమ దందా పై 9490616555 నెంబర్ కు సమాచారం ఇవ్వాలి.

వరంగల్ అర్బన్:సీఎం రాక సందర్భంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కరపత్రాలు కలకలం.సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో హాట్ టాపిక్ గా మారిన కరపత్రాలు.తూర్పు ఎమ్మెల్యే నరేందర్ కబ్జా కోరు అంటూ ఘూటుగా లేఖలో పేర్కొన్న ఆగంతకుడు.న్యూస్ పేపర్ లో పెట్టి వరంగల్ తూర్పు లో పంపిణీ చేసిన గుర్తు తెలియని వ్యక్తులు.నేడు సీఎం కేసీఆర్ వరంగల్ టూర్ ను దృష్టిలో ఉంచుకొని ఎమ్మెల్యే పై ఆరోపణలు చేస్తూ కరపత్రాలు .మొన్నటి కార్పొరేషన్ ఎన్నికల్లో టిఆర్ ఎస్ పార్టీ బి ఫామ్స్ 50 లక్షలకు అమ్ముకున్నడాని, గతంలో ములుగు జిల్లాలో ఎంపిటిసి, జెడ్పిటిసి ఎన్నికల సమయంలోను ఇలాగే డబ్బులు వాసులు చేసాడని లేఖలో పేర్కొన్న గుర్తు తెలియని వ్యక్తులు.వరంగల్ తూర్పులో బుకబ్జాలు, అధికార పార్టీ నేతలపై వేధింపులు, సెటిల్ మెంట్ అంటూ ఘాటుగా ఆరోపణలు చేసిన ఆగంతకులు

ఖమ్మం : నగరంలో బీజేపీ పార్టీ ఖమ్మం అర్బన్ టౌన్ అధ్యక్షుడు కుమిలి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ 10వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు . అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కోసం విద్యార్థి దశ నుంచి నమ్మిన సిందంతము కోసము అహర్నిశలు పోరాడినా మహానీయుడని , తెలుగు , ఉర్దూ, హిందీ , ఇంగ్లీష్ భాషల్లో మంచి ప్రాధాన్యత కలిగిన వ్యక్తి ఆర్థిక శాస్త్రంలో పీహెచ్‌డీ పట్టా పొంది , ప్రిన్సిపాల్ గా , రిజిస్ట్రార్ గా పని చేసి కాకతీయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ వరకు పదవులు పొంది మొదటి ఎస్సార్సీ కమీషన్ ముందు హాజరై తెలంగాణ వాణిని బలంగా వినిపించిన మేధావి కొత్తపల్లి ఆచార్య జయశంకర్ సార్ అని కొనియాడారు . ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు అంజన్న , సురేష్ , నాగేశ్వరరావు , శ్రీ కృష్ణ , కార్తిక్ తదితరులు పాల్గోన్నారు .

వైరా మున్సిపాలిటీ లో నూతనంగా పారిశుద్ధ్యానికి కొనుగోలు చేసిన ట్రాక్టర్లను ప్రారంభించిన ఎమ్మెల్యే రాములు నాయక్.వైరా పట్టణ ప్రజలకు 12 లక్షల రూపాయల వ్యయంతో తడి పొడి చెత్త బుట్టలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ మున్సిపల్ చైర్మన్ సూత కాని జైపాల్

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలలో భాగంగా రెండ‌వ రోజైన సోమ‌వారం,శ్రీ సుందరరాజస్వామివారికి అభిషేకం జ‌రిగింది. కోవిడ్‌-19 వ్యాప్తి నేపథ్యంలో ఆల‌యంలో ఏకాంతంగా ఈ ఉత్స‌వాల‌ను నిర్వ‌హిస్తున్నారు.

    ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన, నిత్యార్చన, నిర్వహించారు. మధ్యాహ్నం 2.30 నుండి 4.00 గంటల వరకు శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ సుందరరాజస్వామివారి ఉత్స‌వ‌మూర్తుల‌కు అభిషేకం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, ఇత‌ర సుగంధ ద్ర‌వ్యాల‌తో ఉత్సవమూర్తులకు అభిషేకం చేశారు.

     కాగా జూన్ 22 నుండి 24వ తేదీ వరకు శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవ మూర్తులకు అభిషేకం నిర్వహిస్తారు.

    ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి క‌స్తూరి బాయి, ఏఈవో శ్రీ ప్ర‌భాక‌ర్ రెడ్డి, సూప‌రింటెండెంట్ శ్రీ శేష‌గిరి, ఆల‌య అర్చ‌కులు శ్రీ బాబుస్వామి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ రాజేష్‌, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

చింతకాని మండలం నేరేడ గ్రామం లో వివిధ పార్టీ ల నుండి TRS పార్టీ లోకి 25 కుటుంబాలు సుమారు 100 మంది జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు గారి అధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది వారికి పార్టీ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించరు.ఈసందర్భంగా జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు గారు మాట్లాడుతూ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు చేస్తున్నటువంటి అభివృద్ధి, సంక్షేమం చూసి అనేక మంది టిఆర్ఎస్ పార్టీలో చేరడం జరుగుతుందని ఇప్పుడు కొత్తగా చేరిన వారు పాతవారు కలిసికట్టుగా పని చేసి మరింత పార్టీ బలోపేతానికి కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ kopuri పూర్ణయ్య, జడ్పీటీసీ తిరుపతి కిషోర్, టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు పెండ్యాల పుల్లయ్య, రైతు బంధు సమితి జిల్లా కమిటీ సభ్యులు మంకెన రమేష్, వంకాయలపాటి లచ్చయ్య, ప్రసాద్, నన్నక కోటయ్య, ఆలస్యం శంకర్,వెంకటి, రాఘo లింగబాబు,లింగయ్య, శంకర్రావు, వెంకటేశ్వర్లు చవల లక్ష్మణుడు, తదితరులు టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు.