జర్నలిస్ట్ రఘు అక్రమ అరెస్ట్ ను నిరసిస్తూ తీన్మార్ మల్లన్న స్టేట్ కమిటీ పిలుపు మేరకు ఈ రోజు స్థానిక కొణిజర్ల,,తల్లాడ, ఏన్కూర్ మండలాల తహసిల్దార్ కు వినతిపత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి వైరా నియోజకవర్గ ఇన్ చార్జ్ కాకాటి వినోద్ కుమార్ హాజరు అయ్యి ,జర్నలిస్ట్ గంజి రఘును ప్రభుత్వం కావాలని అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారు.ప్రభుత్వం చేసే అక్రమాలను, అన్యాయాలను వెలికి తీస్తునందున,ప్రశ్నిస్తుండడం మూలంగా ప్రభుత్వం ఈ విధమైన అక్రమ అరెస్టు లకు పాల్పడుతుంది. తన ఇంటి సమీపంలో పండ్లు కొంటున్న రఘు తలకు పోలీసులు ముసుగు వేసి కిడ్నాప్ చేసి,ఆ తర్వాత అరెస్ట్ చేసినట్టుగా చెప్పడం చాలా దారుణం కావున ఈ ప్రభుత్వం వెంటనే అక్రమ కేసులు కొట్టివేస్తూ,బేషరతుగా విడుదల చేయాలని తీన్మార్ మల్లన్న వైరా నియోజకవర్గ ఇన్ చార్జి కాకాటి వినోద్ కుమార్ ఈ ప్రభుత్వం ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తీన్మార్ మల్లన్న కమిటీ సభ్యులు ప్రకాష్ గుంటుపల్లి కృష్ణ నరసింహారావు ఆనంద్ విజయ్ తదితరులు పాల్గొన్నారు

గత నెలలో బాలానగర్ రాజు కాలనీ లో మూడు ఇళ్లలో దొంగతనాలకు పాల్పడిన దొంగలు రాజు కాలనీకి చెందిన మహమ్మద్ అంజద్ (21)సిక్ విలేజ్ కు చెందిన షేక్ షారుక్ (23)ఇద్దరు కలిసి రాత్రి పూట ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న పాత నేరస్తులనుగుర్తించిన బాలనగర్ పోలీసులువిరి వద్ద నుండి 15 తులాల బంగారం ఆభరణాలు 23 తులాల సిల్వర్ ఒక పల్సర్ బైక్ స్వాధీనం చేసుకున్న పోలీసులు.నార్త్ జోన్ పరిధిలోని.వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగతనాలకు పాల్పడిన ఇద్దరు నిందితులు.కార్ఖానా పీఎస్ పరిధిలో రెండు కేసులు బోయిన్ పల్లి పీఎస్ పరిధిలో రెండు కేసులు మారేడ్పల్లి పిఎస్ లో ఒక కేసు మహంకాళి పీఎస్ పరిధిలో ఒక కేసు.గతంలోమహమ్మద్ అంజద్ పిడియాక్ట్ కేసు నమోదు చేసిన బోయిన్ పల్లి పోలీసులు,బెయిల్పై వచ్చి రాత్రిపూట దొంగతనాలకు పాల్పడుతూ ఉన్నట్టు గుర్తించిన బాలనగర్ పోలీసులు

ఒకవేళ థర్డ్ వేవ్ కనుక వస్తే పిల్లల్లో దాని ప్రభావం ఎలా ఉంటుంది, తీవ్రత ఏ రకంగా ఉంటుందన్న దానిపై తల్లి దండ్రులకు అవగాహన కల్పించడానికి చర్యలు తీసుకోవాలని మంత్రి ఆళ్ల నాని DMHO డాక్టర్ సునందను అదేశించారు

చిన్నారులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించడానికి రాష్ట్ర వ్యాప్తంగా మూడు కేర్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి అదేశాలు ఇచ్చారని,ఒకటి విశాఖపట్నం, రెండోది కృష్ణా -గుంటూరు మధ్య, మూడవది తిరుపతిలో అత్యుత్తమ పిడియాట్రిక్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు మంత్రి ఆళ్ల నాని చేప్పారు…

అన్ని టీచింగ్ హాస్పిటల్స్ లో పిడియాట్రిక్ వార్డ్లు ఏర్పాటు చేయాలని, పిల్లలకు అత్యుత్తమ వైద్యం అందించడానికి వాటిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని, జాతీయ ప్రమాణాలను అనుసరించి పీడీయాట్రిక్ వార్డ్ లు ఏర్పాటుకు ప్రత్యేకంగా ద్రుష్టి పెట్టాలని మంత్రి ఆళ్ల నాని సూచించారు…

5సంవత్సరాల లోపు పిల్లలు ఉన్న తల్లులు జాబితా ముందుగానే సిద్ధం చేసుకోవాలని, చిన్నారుల ఉన్న తల్లులకు వెంటనే టీకాలు వేసే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆళ్ల నాని విజ్ఞప్తి చేశారు…

ఏలూరులోని ఉప ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సోమవారం కోవిడ్ థర్డ్ వేవ్,5సంవత్సరాలలోపు తల్లులు జాబితా సిద్ధం, టీకాలు ప్రక్రియ వేగవంతంపై మంత్రి ఆళ్ల నాని DMHO డాక్టర్ సునందతో సమీక్షా సమావేశం నిర్వహించారు…

ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా హాస్పిటల్స్ ముందుగానే పరిశీలించి అవకాశం ఉన్న చోట పిల్లలకు చికిత్స అందించాలని, థర్డ్ వేవ్ వస్తుందని అనుకుని అవసరమైన మందులు ముందుగానే తెచ్చి పెట్టుకోవాలని మంత్రి ఆళ్ల నాని విజ్ఞప్తి చేశారు…

అదే విధంగా ప్రస్తుతం సంపూర్ణ పోషణ కింద డ్రైరేషన్ సక్రమంగా ఇస్తున్నామా, లేదా, అలాగే గోరుముద్ద కింద కూడ డ్రైరేషన్ సక్రమంగా ఇస్తున్నామా, లేదా,అనే దానిపై కూడ పర్యవేక్షణ చేయాలని, ఇవన్నీ సక్రమంగా చేసుకుంటూ ముందుకు వెళ్తే ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కోవడానికి సన్నద్ధంగా ఉండవచ్చునని, పిల్లలకు వైద్యం అందించాల్సిన హాస్పిటల్స్ ముందుగానే ఎంపానల్ కోసం గుర్తించాలని ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి అదేశించినట్టు మంత్రి ఆళ్ల నాని తెలిపారు…

ప్రవేట్ టీచింగ్ హాస్పిటల్స్ కు కూడ థర్డ్ వేవ్ పై సమాచారాన్ని ఇచ్చి ముందుగానే సన్నద్ధం చేయాలని హాస్పిటల్స్ వారిగా ఏర్పాటు చేయదలసిన ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ల పై కూడ ద్రుష్టి పెట్టాలని ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి చేప్పినట్టు మంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు.అర్హులైన తల్లులకు ఒక రోజు ముందుగానే వ్యాక్సిన్ టోకెన్స్ పంపిణికి ఏర్పాట్లు చేయాలని,
టోకెన్స్ లో సూచించిన విధంగా తేది, సమయంప్రకారం ANM, ఆశా వర్కర్లు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆళ్ల నాని సూచించారు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను సీఎం జగన్‌ కలిశారు. నామినేటెడ్‌ ఎమ్మెల్సీల పేర్లు ఆమోదంపై గవర్నర్‌తో చర్చించనున్నట్లు తెలుస్తోంది. త్రోట త్రిమూర్తులు, లేళ్ల అప్పిరెడ్డి, మోసేన్‌ రాజు, రమేశ్‌ యాదవ్‌ పేర్లను ప్రభుత్వం పంపినట్లు పేర్కొన్నారు. అభ్యర్థుల ఎంపిక విధానం, ప్రాధాన్యత అంశాలను వివరించనున్నారు. 80 కార్పరేషన్లు, 960 డైరెక్టర్ల పదవుల భర్తీకి సీఎం కసరత్తు చేస్తున్నారు. నామినేటెడ్‌ పదవుల భర్తీపై గవర్నర్‌ సూచనలను సీఎం తీసుకోనున్నారు. తాజా రాజకీయ పరిణామాలపైనా గవర్నర్‌తో చర్చించనున్నట్లు తెలుస్తోంది.

కోవిడ్‌ –19 ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా అనూహ్య పరిస్థితులు తలెత్తాయి, వైరస్‌ ఉద్ధృతిని అడ్డుకోవడానికి కర్ఫ్యూ లాంటి నియంత్రణలు విధించాం. కోవిడ్‌ కారణంగా కర్ఫ్యూ పొడిగించడం వల్ల ఆర్ధికంగాను పెనుభారం పడింది. అయినా రుణాల పంపిణీలో నిర్దేశించుకున్న లక్ష్యాలకన్నా అధికంగానే చేపట్టాం. ప్రాధాన్యత రంగాల్లో 105 శాతం, వ్యవసాయ రంగంలో 114.16 శాతం లక్ష్యాలను చేరుకున్నాం.ఈ వృద్ధిని సాధించడంలో బ్యాంకుల పాత్ర మరువలేనిది. కాని కొన్ని అంశాల్లో బ్యాంకుల సమర్థత పెరగాల్సి ఉంది. అగ్రి ఇన్‌ఫ్రా, ఇతర వ్యవసాయ అనుబంధ రంగాలు, గృహాలు, విద్య అంశాల్లో పెరగాల్సి ఉంది.

స్కూళ్లు, ఆస్పత్రులను అభివృద్ధి చేస్తున్నాం:
స్కూళ్లు, ఆస్పత్రులలో నాడు – నేడు కింద పనులు చేపట్టాం. అలాగే వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంపై దృష్టిపెట్టాం.
ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిషు మీడియం తీసుకు వచ్చాం, సీబీఎస్‌ఈ అఫిలియేషన్‌కూడా చేశాం. ఇప్పుడు ప్రభుత్వ స్కూళ్లు సమాజానికి భారం కాదు. ప్రైవేటు స్కూళ్లతో పోల్చితే పిల్లలు ప్రభుత్వ స్కూళ్లకు తిరిగి వస్తున్నారు. స్కూళ్లలో ఇది ఉద్యమంలా సాగుతోంది. తొలిదశలో 15,650 స్కూళ్లను నాడు నేడు కింద అభివృద్ధి చేశాం. ఇప్పుడు రెండో దశ కింద నాడు నేడు పనులు చేపట్టి సుమారు 16 వేల స్కూళ్లను బాగు చేస్తున్నాం. స్కూళ్లలో మౌలిక సదుపాయలను గణనీయంగా మెరుగుపర్చుతున్నాం.

ఏపీలో మహా నగరాలు లేవు :
బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్‌ లాంటి టయర్‌ ఒన్‌ నగరాలు మన రాష్ట్రంలో లేవు. అత్యుత్తమ వైద్యం కోసం ఆ నగరాలకు వెళ్లాల్సిన పరిస్థితి. అందుకనే ప్రస్తుతమున్న మౌలిక సదుపాయాలను జాతీయ స్ధాయిలో మెరుగుపర్చేందుకు… గ్రామ స్ధాయిలో విలేజ్‌ క్లినిక్స్‌ నుంచి పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రులు మొదలుకుని టీచింగ్‌ ఆస్పత్రుల వరకూ ఆస్పత్రులను అభివృద్ధి చేపట్టాం.
16 కొత్త మెడికల్‌ కాలేజీలను తీసుకు వస్తున్నాం.
ప్రతి పార్లమెంటులో ఒక టీచింగ్‌ఆస్పత్రి దిశగా వెళ్తున్నాం. సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిని, వైద్యులను పార్లమెంటు నియోజకవర్గం స్ధాయిలో అందుబాటులో ఉంచబోతున్నాం.

వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులు
గ్రామ స్ధాయిలో రైతు భరోసా కేంద్రాలు(ఆర్బీకే)ను తీసుకు వచ్చాం. దాదాపు 10 వేలకు పైగా ఆర్బీకేలను తీసుకువచ్చాం. ప్రతి 2వేల జనాభాకు ఒక ఆర్బీకే పెట్టాం. నాణ్యమైన ధృవీకరించిన విత్తనాల దగ్గరనుంచి, పండించిన పంటను అమ్మేంతవరకూ రైతుకు చేదోడు, వాదోడుగా ఈ ఆర్బీకేలు నిలుస్తాయి. ఆర్బీకేల స్థాయిలో వ్యవసాయరంగంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తున్నాం. ఆర్బీకేల ద్వారా గ్రామస్ధాయిలో అగ్రి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను మెరుగుపర్చేందుకు, గోడౌన్లు, కోల్డ్‌ స్టోరేజీలు సహా అన్ని రకాల సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నాం. పార్లమెంటు నియోజకవర్గం స్థాయిలో సెకండరీ ఫుడ్‌ ప్రాససింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నాం.

మహిళా సాధికారిత
మహిళా సాధికారితకోసం అనేక చర్యలు తీసుకున్నాం. మహిళా సాధికారితపై ప్రధానంగా దృష్టి సారించాం. దీనికోసం వరుసగా నాలుగు సంవత్సరాలు పాటు చేయూత, ఆసరాల కింద వారిని అదుకుంటున్నాం. లబ్ధిదారులైన మహిళలకు స్థిరంగా నాలుగేళ్లపాటు వారి చేతిలో డబ్బు పెడుతున్నాం. అలాగే మహిళలు వారి పిల్లలను తమతో పాటు పనికి తీసుకెళ్లకుండా, స్కూళ్లకు పంపించేలా స్ఫూర్తి నింపేందుకు తొలిసారిగా అమ్మ ఒడి కింద కూడా వారికి ఏడాదికి డబ్బు ఇస్తున్నాం. ఈ మూడు పథకాలు మహిళా సాధికారితలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.

17వేలకుపైగా కొత్త కాలనీలను నిర్మిస్తున్నాం :
కొత్తగా 17 వేల గ్రీన్‌ఫీల్డ్‌ కాలనీలను నిర్మిస్తున్నాం. తద్వారా 28.30 లక్షల ఇళ్లను పేదల కోసం నిర్మించబోతున్నాం. అర్హులైన లబ్ధిదారుల ఎంపిక కోసం సోషల్‌ ఆడిట్‌ నిర్వహించి,గ్రామ సచివాలయాల ద్వారా పారదర్శక పద్ధతిలో ఎంపిక చేశాం. ఈ ఏడాది 15.60 లక్షలకుపైగా ఇళ్లను ఈ 17 వేల కాలనీల్లో తొలివిడతలో నిర్మిస్తున్నాం. వచ్చే ఏడాది కూడా మరో 12.08 ఇళ్లను నిర్మించబోతున్నాం.

కాలనీల్లో మౌలిక సదుపాయాలు
ఈ కాలనీలు మురికివాడలుగా మారకూడదు, అందుకనే మౌలికసదుపాయాలను కల్పిస్తున్నాం. తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, ఇతర సోషల్‌ ఇన్‌ఫ్రానుకూడా కల్పిస్తున్నాం. రానున్న మూడేళ్లలో దీనికోసం దాదాపుగా రూ. 34వేల కోట్లు ఖర్చు చేస్తాం.
ఈ అంశాల్లో బ్యాంకుల సహకారం కావాలి. 28.30 లక్షల ఇళ్ల నిర్మాణం ద్వారా ఈ 17 వేల కాలనీలు అందంగా నిర్మించబోతున్నాం.

ఎంఎస్‌ఎంఈ , రీ -స్టార్ట్‌
ఎంఎస్‌ఎంఈల కోసం రీస్టార్ట్, నవోదయ కార్యక్రమాలతో రుణాల పునర్‌ వ్యవస్థీకరణ కార్యక్రమం చేపట్టాం. కోవిడ్‌సమయంలో కూడా వాటికి చేయూత నిచ్చి నడిపించాల్సిన అవసరం ఉంది.

కౌలు రైతులకు -రుణసాయం
అలాగే కౌలు రైతులకు రుణాల సదుపాయంకూడా దృష్టిపెట్టాలని బ్యాంకులను కోరుతున్నాను. కౌలు రైతులను ఆదుకోవాలని కోరుతున్నాను. గ్రామాల స్థాయిలో ఆర్బీకేలు ఉన్నాయి. ఇ– క్రాపింగ్‌ కూడా గ్రామ సచివాలయాల స్థాయిలో చేస్తున్నాం. ప్రతి కార్యక్రమం పారదర్శకంగా చేస్తున్నామని, కౌలు రైతులకు రుణాలపై బ్యాంకులు మరింత దృష్టి పెట్టాలని సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ తన ప్రసంగం ముగించారు.

2021–22 వార్షిక రుణ ప్రణాళిక ఇలా:
– 2021–22 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర వార్షిక రుణ ప్రణాళిక మొత్తం రూ.2,83,380 కోట్లు
–దీంట్లో భాగంగా 54శాతం రుణాలు వ్యవసాయ రంగానికి
వ్యవసాయరంగంలో రూ.1,48,500 కోట్లు ఇవ్వాలని లక్ష్యం
– మొత్తంగా ప్రాథమిక రంగానికి రూ. 2,13,560 కోట్ల రుణాలు ఇవ్వాలని: లక్ష్యం, వార్షిక రుణ ప్రణాళికలో ఇది 75.36శాతం

–ఎస్‌ఎస్‌బీసీ సమావేశంలో వర్చువల్‌గా పాల్గొన్న యూనియన్‌ బ్యాంక్‌ ఎండీ, సీఈఓ రాజ్‌కిరణ్‌రాయ్‌
– ఏపీకి ఎస్‌ఎల్‌బీసీగా వ్యవహరిస్తున్న యూనియన్‌ బ్యాంక్‌
రాజ్‌ కిరణ్‌ రాయ్‌ ఏమన్నాంటే…:
– కోవిడ్‌ విపత్తు సమయంలో ప్రజలకు చేయూత నివ్వడానికి ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ అనేక చర్యలు తీసుకున్నారు: రాజ్‌కిరణ్‌ రాయ్‌
–ముఖ్యమంత్రి దార్శినిక పాలనద్వారా సుస్థిర ఆర్థికాభివృద్ధి లక్ష్యాలపై 2020 సంవత్సరానికిగాను నీతి ఆయోగ్‌విడుదలచేసిన ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్‌ అత్యుత్తమ 5 రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచింది:
– దీనికి ముఖ్యంత్రికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా:
– కోవిడ్‌వల్ల అనేక అడ్డంకులు వచ్చినప్పటికీ ప్రజలను ఆదుకునే సంక్షేమ పథకాలనుంచి ఏపీ పక్కకు వెళ్లకపోవడం గుర్తించదగ్గ విషయం:
– పేదలకోసం జగనన్న కాలనీలపేరిట ఏపీ ప్రభుత్వం లక్షలాది ఇళ్లను నిర్మిస్తోంది. ఇది బ్యాంకులకు మంచి అవకాశం:
– కౌలు రైతులను ఆదుకోవడంపై బ్యాంకులు దృష్టిపెట్టాలి:
– రైతు భరోసా కేంద్రాల్లో సేవలను అందించడంపై బ్యాంకుల బ్రాంచీలు దృష్టిపెట్టాలి:
– ఆత్మనిర్భర్‌ ద్వారా, కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలను∙ప్రకటించింది. ఆర్థిక రంగాన్ని పురోగతిలో నడిపించడానికి, ఆమేరకు లక్ష్యాలను అందుకోవాలని కోరుతున్నా:
– 2020–21లో ప్రాథమిక రంగం లక్ష్యం రూ. 1,87,550 కోట్లు అయితే 105.3 శాతం లక్ష్యం చేరుకున్నాం. రూ. 1,96,982 కోట్లు రుణాలు ఇచ్చాం.
– వ్యసాయరంగం కింద నిర్దేశించుకున్న దాంట్లో 114.16 శాతం లక్ష్యాన్ని చేరుకున్నాం. రూ. 1,28,660 కోట్ల లక్ష్యానికి గానూ రూ.1,46,879 కోట్లు ఇచ్చాం.

– ఎంఎస్‌ఎంఈ రంగానికి రూ.39,600 కోట్లకుగానూ రూ.40,312 కోట్లు ఇచ్చాం. అనుకున్న లక్ష్యాన్ని దాటి 101.8శాతం ఇచ్చాం.
– నాన్‌ ప్రయార్టీ రంగం కింద రూ.64.050 కోట్లకుగానూ రూ. 90,652 కోట్లు ఇచ్చాం. 141.53శాతం రుణాలు ఇచ్చాం:
వ్యాక్సినేషన్‌లో బ్యాంకు సిబ్బందికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నా:

ఈ సమావేశానికి వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, వ్యవసాయశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ పూనం మాలకొండయ్య, పరిశ్రమలశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ కరికాల వలవెన్, ఆర్ధికశాఖ ముఖ్యకార్యదర్శి ఎస్‌.ఎస్‌.రావత్, సాంఘిక సంక్షేమశామ ముఖ్య కార్యదర్శి కె సునీత, ఆర్ధిక శాఖ కార్యదర్శి సత్యనారాయణ, వ్యవసాయశాఖ కమిషనర్‌ హెచ్‌ అరుణ్‌కుమార్, సెర్ప్‌ సీఈఓ రాజాబాబు, ఎస్‌ఎల్‌బీసీ, ఏపీ, కన్వీనర్‌ వి బ్రహ్మానందరెడ్డి, నాబార్డు సీజీఎం, సుధీర్‌ కుమార్‌ జన్నావర్‌తో పాటు వివిధ బ్యాంకులకు చెందిన ఉన్నతాధికారులు హాజరయ్యారు.

వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా యూనియన్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా ఎండీ, సీఈఓ రాజ్‌ కిరణ్‌ రాయ్, ఆర్‌బీఐ, జీఎం, యశోధా భాయి పాల్గొన్నారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఇవాళ కరోనా కేసులు ఐదు వేలలోపు నమోదయ్యాయి. 24గంటల వ్యవధిలో 87,756 నమూనాలను పరీక్షించగా 4,549 పాజిటివ్‌ కేసులు.. 59 మరణాలు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 18,14,393కి చేరింది. కరోనాతో ఇప్పటి వరకు 11,999 మంది మృతి చెందారు. కరోనా నుంచి 17,22,381 మంది కోలుకుని డిశ్చార్జి కాగా.. రాష్ట్రవ్యాప్తంగా 80,013 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది.

కరోనా వైర‌స్ ఎన్నో కుటుంబాల‌ను చిన్నాభిన్నం చేస్తోందని, తల్లితండ్రులు మ‌ర‌ణించ‌గా పిల్ల‌లు దిక్కులేని అనాథ‌లుగా మారుతున్నారని ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి మానవత్వంతో స్పందించి త‌ల్లితండ్రుల‌ను కోల్పోయిన పిల్ల‌ల సంర‌క్ష‌ణ బాధ్యతలను తీసుకోవ‌టంతో పాటు రూ.10 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించడం భారతదేశంలోనే ముందంజలో ఉందని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) కొనియాడారు. గత మే నెల 21 వ తేదీన పెడన 7 వ వార్డు వీరభద్రాపురంలో 10 రోజులు హోమ్ ఐసోలాటిన్ పూర్తయిన కరోనా తగ్గడం లేదని భయంతో బలవన్మరణంకు పాల్పడిన చేనేత కార్మిక దంపతులు జక్కుల లీలా ప్రసాద్ , భారతి విషాద ఉదంతం జిల్లావాసులు అందరికి విదితమే. వారి సంతానం ఇరువురు ఆడపిల్లలైన జక్కుల ఉషశ్రీ సాయి ( 11) , జక్కుల జూహితేశ్వరి ( 5 ) లకు సోమవారం మధ్యాహ్నం వారి ఇంటివద్దే ఒక్కొక్కరికి రూ.10లక్షల బాండ్లను అందజేసే కార్యక్రమంలో మంత్రి పేర్ని నాని ,పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ లు పాల్గొన్నారు.


ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ, చేనేత కార్మిక దంపతులు బలవన్మరణానికి పాల్పడం తమని తీవ్రంగా కలచివేసిందని,జరిగిన దురదృష్టకర సంఘటన గురించి సీఎం శ్రీ జగన్ గారి దృష్టికి తీసుకెళ్లి,తల్లిదండ్రులను కోల్పోయి అనాధాలైన ఆ చిన్నారులను అన్ని విధాలుగా ఆదుకోవాలని అభ్యర్ధించమన్నారు. కోవిడ్‌ విపత్తు కారణంగా తల్లితండ్రులు చనిపోతే పిల్లలు అనాథలు కాకుండా రూ.10 లక్షలు బ్యాంకులో డిపాజిట్‌ చేసే పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారన్నారు. బాధిత చిన్నారుల పేరిట జాతీయ బ్యాంకులో రూ.10 లక్షలు డిపాజిట్‌ చేసి బాండ్‌ను అందించినాట్లు వివరించారు. 25 ఏళ్లు నిండాక ఈ సొమ్ము తీసుకునేందుకు వీలుంటుందని, అప్పటి వరకు వడ్డీ మొత్తాన్ని నెలవారీగానీ, మూడు నెలలకోసారి గానీ తీసుకోవచ్చన్నారు. ఈ సొమ్ము చదువుకు, ఇతర అవసరాలకు ఉపయోగపడుతుందన్నారు. చిన్నారుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఈ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. కరోనా కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తున్నదని వైరస్‌ బారిన పడి, ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న వారి పిల్లలను కొందరు బంధువులు కూడా దగ్గరకు రానీయని పరిస్థితి నెలకొన్నదని, ఇటువంటి పరిస్థితులలో చిన్నారుల సంరక్షణ బాధ్యతలను ప్రభుత్వం స్వీకరించడం ఎంతో గొప్ప చర్యని పేర్కొన్నారు.


చిన్నారులతో ముచ్చటించిన మంత్రి పేర్ని నాని :తొలుత చిన్నారుల తల్లితండ్రుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మంత్రి పేర్ని నాని ఉషశ్రీ సాయి, జూహితేశ్వరిలతో ఫోటోల ముందు పువ్వులు వుంది చేతులు జోడించి నమస్కారం పెట్టించారు. అనంతరం వారితో ఆప్యాయంగా సంభాషించారు. మీరిద్దరూ ఏ స్కూల్ లో చదువుతున్నారు ? స్కూల్ కు ఎలా వెళుతున్నారు అని ప్రశ్నించారు. అయిదేళ్ల చిన్నారి జుహితేశ్వరి ఆటోలో వెళతామని జవాబు ఇచ్చింది. తాను టీచర్ అవుతానని ఉషశ్రీ సాయి తెలిపింది. తన మాట చెల్లి అస్సలు వినడం లేదని మంత్రికి తెలిపింది. మీరిద్దరూ చక్కగా చదువుకొండమ్మ నేను మీకు ఎప్పుడూ సహాయంగా ఉంటానని మంత్రి పేర్ని నాని వారితో చెప్పారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ బళ్ళ జ్యోత్స్నా రాణి,వైస్ చైర్మన్ మహ్మద్ ఖాజా, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కటకం ప్రసాద్, పెడన తహసీల్దార్ పి. మధుసూధనరావు, మునిసిపల్ కమీషనర్ ఎం అంజయ్య, వార్డు కౌన్సెలర్లు ,పట్టణ వైస్సార్ సి పి నాయకులు బండారు మల్లిఖార్జునరావు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

కడప:- వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం వద్ద సోమవారం టెన్షన్‌ నెలకొంది.విశ్వబ్రాహ్మణ సంఘం ఛైర్మన్‌ శ్రీకాంత్‌ చారిని మఠం నాయకులు అడ్డుకున్నారు.మఠం వివాదంపై మీడియాతో మాట్లాడుతున్న శ్రీకాంత్ చారిపై దాడికి యత్నించారు.దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో భారీగా పోలీసులు మోహరించారు.పోలీసుల రంగ ప్రవేశంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు.కాగా, బ్రహ్మంగారి మఠం వారసత్వంపై వివాదం కొనసాగుతోంది.ఆధిపత్య పోరు నెలకొంది.పూర్వపు మఠాధిపతి వీరభోగ వసంతవెంకటేశ్వరస్వామి ఇటీవల కరోనాతో శివైక్యం చెందిన విషయం తెలిసిందే.ఆయన పెద్ద భార్య చంద్రావతికి నలుగురు కుమారులు,నలుగురు కుమార్తెలు ఉన్నారు.చంద్రావతి అనారోగ్యంతో మృతి చెందడంతో ఆయన పదేళ్ల క్రితం రెండో వివాహం చేసుకున్నారు.

రెండో భార్యకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరు మైనర్లు.పెద్ద భార్య పెద్ద కుమారుడు వెంకటాద్రి స్వామి (53), రెండో భార్య పెద్ద కుమారుడు గోవిందస్వామి (9)ల మధ్య పోటీ నెలకొంది.ఇదిలా ఉంటే, చారిత్రక శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి మఠం ఖ్యాతి,గౌరవ మర్యాదలకు ఎటువంటి భంగం కలగకుండా తదుపరి మఠాధిపతిని ఎంపిక చేసేందుకు ధార్మిక పరిషత్‌ నిబంధనల ప్రకారం తదుపరి చర్యలకు దేవదాయ శాఖ ఉపక్రమించింది.

ఈ అంశంపై చర్చించేందుకు ఆ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు ఆదివారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే.బ్రహ్మంగారి మఠం తరహా సంప్రదాయం కలిగి ఉండే మఠాధిపతులు,భక్తులతో ఒక కమిటీని ఏర్పాటుచేసి, దాని సూచనల మేరకు ధార్మిక పరిషత్‌ ద్వారా తదుపరి మఠాధిపతిని ప్రకటించాలని సమావేశంలో నిర్ణయించారు.ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు కొంత సమయం పట్టే అవకాశం ఉన్నందున అప్పటివరకు మఠానికి తాత్కాలిక ఫిట్‌పర్సన్‌ (పర్సన్‌ ఇన్‌చార్జి)గా వైఎస్సార్‌ కడప జిల్లా దేవదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ శంకర్‌ బాలాజీని నియమించారు.ఈ మేరకు ఆ శాఖ ప్రత్యేక కమిషనర్‌ అర్జునరావు ఉత్తర్వులు జారీచేశారు. 

విజయవాడ: తేది: 14-06-2021 వైద్య మరియు ఆరోగ్య శాఖలో పనిచేయుచున్న అందరు ఉద్యోగులను కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 50లక్షలను అదనంగా రాష్ట్ర ప్రభుత్వం కుడా Exgratia ఇవ్వాలని APNGOs’ సంఘం డిమాండ్ ప్రభుత్వానికి పెట్టడం, అనేక దఫాలుగా విజ్ఞప్తి చేసిన పిమ్మట ప్రభుత్వం సత్వరమే అంగీకరించి G.O. ఇవ్వడం, కోవిడ్ తో చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు కొంత ఊరట కలుగుతుంది. కావున, ముఖ్యమంత్రి గారికి హృదయ పూర్వక కృతజ్ఞతలు APNGOs’ సంఘం ద్వారా తెలియచేయుచున్నాము.

వైద్య ఆరోగ్య శాఖ లో పనిచేయుచు కోవిడ్ వలన ఉద్యోగులకు Exgratia ప్రకటిస్తూ G.O.Ms.No.299 ద్వారా ఉత్తర్వ్యులు ఇచ్చిన గౌరవ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు APNGOs’ సంఘం అధ్యక్ష్య, ప్రధాన కార్యదర్శులు శ్రీ నలమారు చంద్ర శేఖర్ రెడ్డి మరియు శ్రీ బండి శ్రీనివాస రావు లు ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలియచేసారు. వైద్య ఆరోగ్య శాఖ లో అధిక శాతం పనిచేయుచున్న కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కుడా ఈ ఉత్తర్వ్యులను వర్తింప చేయాలని వారిని కుడా ప్రభుత్వం ఆదుకోవాలని వారు ముఖ్యమంత్రి వర్యులకు విజ్ఞప్తి చేసారు. ఇంకా ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ఉన్న వివధ శాఖల ఉద్యోగులకు కుడా ఇదే విధమైన ఉత్తర్వ్యులను అమలు చేయలని వారు విజ్ఞప్తి చేసారు. G.O. విడుదలకే పరిమితం కాకుండా సదరు Exgratia ను భాదిత కుటుంబాలకు వెంటనే చెల్లించేలా అధికారు లందరికి తగు ఆదేశములు ఇవ్వాలని వారు విజ్ఞప్తి చేసారు. వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులకు Exgratia విషయమై ఉత్తర్వ్యులు ఇచ్చినందులకు గాను మెడికల్ ఫెడరేషన్ అధ్యక్ష్య, ప్రధాన కార్యదర్శులు శ్రీ డి.వి.రమణ మరియు శ్రీ ఉల్లి కృష్ణలు ఒక ప్రకటనలో ముఖ్యమంత్రి వర్యులకు కృతజ్ఞతలు తెలియచేసారు.

కూకట్పల్లి సంషిగూడా లో నివసించే ఉప్పరి రాజు అనే వ్యక్తి ఈనెల 11న ఆదిత్య నగర్ లో నివసించే అల్లాడ వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఇంట్లో దొంగతనాలకు పాల్పడ్డాడు. విలువైన బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లాడు . కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈరోజు ఉప్పరి రాజును అరెస్టు చేశారు అతని నుండి సుమారు రెండున్నర లక్షల విలువచేసే ఆభరణాలను రికవరీ చేశారు.