TT Ads

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. సోమవారం ఉదయం 9 గంటల నుంచి మంగళవారం ఉదయం 9 మధ్య 37,922 నమూనాలు పరీక్షించగా 8,987 మందికి వైరస్‌ సోకినట్లు తేలింది. చికిత్స పొందుతున్న వారిలో 35 మంది చనిపోయారు. ఈ స్థాయిలో మరణాలు నమోదుకావడం ఇదే ప్రథమం. రాష్ట్రంలో మొత్తం 7,472 మంది మరణించారు. క్రియాశీల కేసుల సంఖ్య 53,889కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటిదాకా 1,57,53,679 నమూనాల్ని పరీక్షించి, 9,76,987 మందికి వైరస్‌ సోకినట్లు గుర్తించారు. తాజాగా 3,116 మంది కోలుకున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *