TT Ads

భారత ప్రభుత్వం ప్రతి ఏడాది ఇచ్చే ప్రతిష్టాత్మక జాతీయ చలనచిత్ర అవార్డులను తాజాగా కేంద్రం ప్రకటించింది. ఉత్తమ చిత్రంగా ‘జెర్సీ’కి ఈ అవార్డు లభించగా ఉత్తమ వినోదాత్మక చిత్రంగా ‘మహర్షి’ సినిమా సెలక్ట్ అయింది.

తాజాగా 67వ జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్రం ప్రకటించింది. భారత ప్రభుత్వం ప్రతి ఏడాది ఇచ్చే ఈ ప్రతిష్టాత్మక జాతీయ చలన చిత్ర అవార్డులను నేడు (సోమవారం) ప్రకటించారు. న్యూఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో జ్యురీ సభ్యులు అవార్డుల వివరాలు తెలిపారు. ప్రాంతీయ భాషా విభాగంలో తెలుగు సినిమాలైన నాని ‘జెర్సీ, మహేష్ బాబు ‘మహర్షి’ సినిమాలకు జాతీయ అవార్డులు వరించాయి.

నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపొందిన ‘జెర్సీ’ చిత్రానికి ఉత్తమ చిత్రంగా అవార్డు లభించింది. దీంతో పాటు బెస్ట్ ఎడిటింగ్ విభాగంలో కూడా జెర్సీ చిత్రాన్ని అవార్డు వరించింది. ఈ చిత్రానికి ఎడిటర్‌గా వ్యవహరించిన నవీన్ నూలీ జాతీయ అవార్డును గెలుచుకున్నారు. ఉత్తమ వినోదాత్మక చిత్రంగా మహేష్ బాబు హీరోగా వచ్చిన ‘మహర్షి’ సినిమా సెలక్ట్ అయింది.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *