TT Ads

5వ తరగతిలో తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకులాల ప్రవేశ నోటిఫికేషన్,తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలలో 5వ తరగతి లో ప్రవేశమునకై 2021 – 2022 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష ప్రకటన.

తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాల మరియు విద్యా శాఖల ఆధ్వర్యంలో ఇంగ్లీష్ మీడియం విజయవంతంగా నడుస్తున్న గురుకుల పాఠశాలలో 5వ తరగతి ప్రవేశమునకు అభ్యర్థులు దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా సమర్పించాలి.

ప్రవేశ పరీక్ష తేదీ:30-05-2021,పరీక్ష సమయం:11:00 am నుండి 1:00 pm వరకు,అప్లికేషన్ ప్రారంభ తేదీ:10-03-2021,అప్లికేషన్ చివరి తేదీ:15-04-2021.020-2021 విద్య సంవత్సరం లో 4వ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు మాత్రమే దరఖాస్తు తీసుకోవడానికి అర్హులు,అభ్యర్థులు తమ అర్హతలను పరిశీలించుకుని ఆన్లైన్లో రూ.100/- రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చును ఒక ఫోన్ నెంబర్ తో ఒక దరఖాస్తు మాత్రమే చేయవచ్చును.

ఆన్లైన్ అప్లికేషన్ చేయుటకు కావలసినవి:

  1. అభ్యర్థి ఫోటో
  2. అభ్యర్థి సంతకం
  3. ఆధార్ కార్డ్ నెంబర్
  4. పుట్టిన తేదీ వివరాలు మాత్రమే
  5. కులం , ఆదాయం , నివాసం వివరాలు మాత్రమే
  6. పూర్తి అడ్రస్ సమాచారం.
TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *