TT Ads

త్వరలో వార్షిక బడ్జెట్ సమావేశాలు జరగబోతున్న నేపథ్యంలో శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, కార్యదర్శి శ్రీ పి. కృష్ణమాచార్యులు ఎంతో శ్రద్ధతో నిరంతరం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వాస్తవానికి వెలుపల 60 ఏళ్లు దాటిన వారికే వ్యాక్సిన్ అవకాశం అందుబాటులో ఉంది, అయితే అసెంబ్లీ వార్తలను కవర్ చేసే వారికోసం 45 ఏళ్లు దాటిన జర్నలిస్టులందరికీ ఈనెల 25 , 26 తేదీల్లో శాసనసభ ప్రాంగణంలో “కరోనా టీకాలు” వేస్తున్నారు.. అయితే పర్మనెంట్ పాస్, లేదా గ్యాలరీ ,లాబీ తాత్కాలిక పాసులు కలిగిన జర్నలిస్టులందరికీ ఈ అవకాశం కల్పిస్తున్నారు. ఇక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ,అసెంబ్లీ, సచివాలయ సిబ్బందికి ఈనెల 24వ తేదీ నుంచి వ్యాక్సిన్ ప్రారంభిస్తున్నారు. ఈ సదావకాశాన్ని జర్నలిస్టు మిత్రులు అందరూ వినియోగించుకోవాల్సిన కోరుతున్నాను.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *