TT Ads

ఖమ్మం : 25వ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ భారీ ర్యాలీ ప్రదర్శనలో ముఖ్య అతిథిగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి అజయ్ కుమార్ గారు పాల్గొని 25వ డివిజన్ నుండి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గోళ్ళ చంద్రకళను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోలాటాల నృత్యాలు , డప్పు వాయిద్యాలు , డీజే మధ్య భారీ ప్రదర్శనతో డివిజన్ అన్ని ప్రాంతాలను సందర్శించి ఓటర్లను సైతం ఓట్లను అభ్యర్థించారు .అలాగే 26 , 39వ డివిజన్ల తెరాస అభ్యర్థులు పునుకొల్లు నీరజ, మాడురి ప్రసాద్ లను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతూ ఆయా డివిజన్ల పరిధిలోని ఖిల్లా బజార్, శుక్రవారపేట , మెదర బజార్ , గొల్లబజార్ , రిక్కా బజార్ , సుగ్గాలవారి తోట , ఎస్పీ ఆఫీస్ రోడ్ నందు ప్రచారాని నిర్వహించారు .

అనంతరం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య మంత్రి కెసిఆర్ గారు , కేటీఆర్ గారు నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు .ఈ సందర్బంగా అభ్యర్థులు మాట్లాడుతూ మన రాష్ట్ర రవాణ శాఖ ముఖ్య మంత్రి అజయ్ కుమార్ గారి నేతృత్వంలో కూడా ఖమ్మం లో పలు అభివృద్ధి పనులు జరిగాయని వైకుంఠ ధామం , నూతన బస్టాండ్ , డబుల్ బెడ్ రూమ్లు , రోడ్ల విస్తరణ , వీధి లైట్లు వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని తెలిపారు .ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ ఎలక్షన్ టీఆర్ఎస్ పార్టీ డివిజన్ ఇన్చార్జి ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ , నాయకులు పల్లా రాజేశ్వర్రావు , గోళ్ళ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు .

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *