TT Ads

ఖమ్మం : త్వరలో జరగబోయే మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారి ఆశీస్సులతో 22వ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ నుండి అభ్యర్థిగా పల్లా రోస్లీనా బరిలో నిలిచారు . మంగళవారం నాడు జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు , సుడా డైరెక్టర్ పల్లా కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో డివిజన్ లో ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించారు .ఈ సందర్భంగా వారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను , మన ప్రియతమ నాయకులు , అందరివాడు , నిత్యం అందరికి అందుబాటులో ఉండే రాష్ట్ర రవాణా శాఖ మంత్రి అజయ్ కుమార్ గారు చేసిన పలు అభివృద్ధి పనులను గురించి డివిజన్ ప్రజలకు వివరించి , టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నిలబడ్డ పల్లా రోస్లీనాకు మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు .ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు పల్లా రాజశేఖర్ , కోటయ్య రాజు , అమరగానీ వెంకటేశ్వర్లు , షకీనా , ఝాన్సీ , పల్లా లెనిన్ తదితరులు పాల్గొన్నారు .

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *