TT Ads

అమరావతి: 2023 మార్చికి అన్ని గ్రామాల్లో అన్‌లిమిటెడ్‌ ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఉండాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. అమ్మఒడి పథకంలో ఆప్షన్‌గా ల్యాప్‌టాప్‌ల పంపిణీ, గ్రామాల్లో ఇంటర్నెట్‌ కనెక్షన్లపై జగన్‌ సమీక్ష నిర్వహించారు. ‘‘సొంత ఊళ్లలోనే వర్క్‌ ఫ్రం హోం సదుపాయం కల్పించాలి. ఏ స్పీడ్‌ కనెక్షన్‌ కావాలన్నా ఇచ్చేందుకు సిద్ధంగా ఉండాలి. వచ్చే ఏడాది జనవరి 9న అమ్మఒడి పథకం అమలు చేస్తాం. ల్యాప్‌టాప్‌ కోరుకున్న వారికి జనవరి 9న అందజేయాలి. 9 నుంచి 12వ తరగతి విద్యార్థులకు ల్యాప్‌టాప్‌పై ఆప్షన్‌ ఇవ్వాలి. ల్యాప్‌టాప్‌ చెడిపోతే సర్వీస్‌ సెంటర్‌కు పంపి వారంలో తిరిగి తెప్పించాలి. బిడ్‌ ఫైనల్‌ చేసేటప్పుడు గ్యారెంటీ, వారంటీ, సర్వీస్‌పై దృష్టి పెట్టలి’’ అని అధికారులకు జగన్‌ సూచించారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *