TT Ads

మార్చి 30న మీడియా సెన్సిటైజేషన్ వర్క్‌షాపు,13 జిల్లాల మీడియా ప్రతినిధులు, సమాచార శాఖ అధికారులతో
విపత్తు నిర్వహణ సంస్థాగత నిర్మాణంలో అవగాహన, సూచనలకు వేదికగా విపత్తు నిర్వహణ శాఖ సూచించిన వెబ్ సైట్ లింక్ ద్వారా సమావేశంలో పాల్గొనండి ప్రత్యేక కమిషనరు కన్నబాబు.

విజ‌య‌వాడ‌ : రాష్ట్రంలోని సమాచార పౌర సంబంధాల శాఖ అధికారులకు, సిబ్బందికి, ప్రింట్ అండ్ ఎ లక్ట్రానిక్ మీడియా ప్రతినిధులతో ” విపత్తు సమయంలో కట్టడాలు, భవనాలపై ప్రభావం ” అంశం పై పూర్తి అవగాహన కలిగించేందుకు ఆన్ లైన్ సమావేశాన్ని నిర్వహిస్తున్నామని రాష్ట్ర విపత్తు నిర్వహణా సంస్థ ప్రత్యేక కమిషనరు కె.కన్నబాబు తెలియజేశారు. మార్చి 30వ తేది ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహించే మీడియా సెన్సిటైజేషన్ వర్క్ షాపులో సమాచార శాఖ ఉద్యోగులతో పాటు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు కూడా పాల్గొనాలని కన్నబాబు కోరారు. రాష్ట్రంలో పర్యావరణం, నిర్మాణరంగాల యొక్క భద్రతను, సుస్థిరతను మెరుగుపరిచేందుకు ప్రభుత్వపరంగా చేపడుతున్న సంస్థాగత నిర్మాణాల వివరాలను తెలియజేయడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా విపత్తు పునరుద్ధరణ ప్రాజెక్టు నిర్వహణ, పట్టణ ప్రణాళికా సంచాలకులతో కలిసి విపత్తు ప్రమాదాలను గుర్తించి నివారించేందుకు, నవీకరించేందుకు ఉపచట్టాలను రూపొందించేందుకు అవగాహనా కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. అందులో భాగంగా సమర్ధవంతమైన సంస్థాగత నిర్మాణం (బిల్డింగ్ కెపాసిటి) దిశగా కార్యశాలను నిర్వహిస్తున్నామన్నారు. ఈనెల మార్చి 30వ తేది మంగళవారం ఉదయం 10.30 గంటలకు ప్రాజెక్టు నేపథ్యం పై అధికారులు వివరిస్తారన్నారు. అనంతరం 10.45 గంటలకు విపత్తుల సమయంలో నిర్మాణాలు, భవనాలపై చూపే ప్రభావం పై అవగాహనను ఉదయం 11 గంటలకు స్థితిస్థాపకతకోసం నియంత్రణ, నియంత్రణలో మీడియాపాత్ర (Role of Media in Building, Regulation for Resilience) పై వివరాలు అందించడం జరుగుతుందన్నారు. అనంతరం సమావేశంలో పాల్గొన్నవారి అభిప్రాయాలను తెలుసుకుంటామని కన్నబాబు తెలిపారు. సమాచార శాఖ మరియు మీడియా ప్రతినిధులు మార్చి 30న ఉదయం 10.30 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహించే ఆన్‌లైన్ సెషన్‌లో పాల్గొనడానికి ఈ దిగువు పేర్కొన్న లింక్ ద్వారా సమావేశంలో జాయిన్ కావచ్చని కన్నబాబు తెలిపారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *