TT Ads

రాచకొండ:వనస్థలిపురం పోలీసు స్టేషన్ పరిధిలోని చింతలకుంట లో ఉన్న మెడిసిస్ హాస్పిటల్ లో దారుణం చోటుచేసుకుంది,గత మూడు రోజుల క్రితం నల్గొండ జిల్లా మిర్యాలగూడ తడకమళ్ళ కి చెందిన నాగమణి అనే మహిళ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వగా వెన్నుపూస ఆపరేషన్ చేశారు వైద్యులు. కాగా ఈ రోజు తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో నాగమణి మృతి చెందినట్టు హాస్పిటల్ సిబ్బంది కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు,వెన్నుపూస ఆపరేషన్ చేసిన సమయం నుండి నాగమణి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో కూడా తమకు ఎలాంటి సమాచారం కుడా ఇవ్వని హాస్పిటల్ సిబ్బంది అందించలేదని కుటుంబ సభ్యుల ఆరోపించారు,వైద్యం వికటించడంతోనే నాగమణి మృతిచెందినట్టు కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు, ఇప్పటికే లక్ష రూపాయలు హాస్పిటల్లో కట్టడం జరిగిందని తమకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *