TT Ads

కరోనా తీవ్రస్థాయిలో ప్రబలుతున్నందున తెలంగాణ ప్రభుత్వం G. O.69 జారీ చేసింది. దీని ప్రకారం సామూహికంగా జరుపుకొనే మతపరమైన పండగలు అయిన శ్రీరామనవమి, రంజాన్, హనుమాన్ జయంతి తదితర సందర్భంలో జరిపే ప్రదర్శనలు, ఉత్సవాలు, ఉరేగింపులు, శోభాయాత్రలు వంటి వాటిపై నిషేధం విధించడం జరిగింది.

కావున గ్రామ సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, కార్యదర్శులు, మున్సిపల్ చైర్మన్లు, డిప్యూటీ చైర్మన్లు, కౌన్సిలర్లు, కమిషనర్లు, కాలనీల పెద్దలు, యువజన సభ్యులు, అన్ని పార్టీల నాయకులు అందరికీ విన్నపము, దయచేసి మీ గ్రామాల్లో, కాలనీల్లో రేపు జరిగే హనుమాన్ జయంతి పేరుతో ఆడంబరంగా, గుంపులతో కూడిన
ఎలాంటి ఉత్సవాలు జరపడానికి కానీ , శోభాయాత్రలు కానీ జరపడానికి వీలులేదు, దేవాలయాల్లో.

కేవలం పూజారి,ఒకరిద్దరు మాత్రమే పూజాకార్యక్రమాలు నిర్వహించుకోవాలి. .. కరోనా మనము అనుకున్నదానికంటే చాలా ఎక్కువ స్తాయిలో ఉంది, చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది. ప్రభుత్వం సమాజ క్షేమం గూర్చి ఈ నిర్ణయం తీసుకుంది, కావునదీనిని ఉల్లంగించి ఎవరూ ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించరాదు, ఒకవేళ ఎవరైనా ఈ ఆదేశాలను ఉల్లంఘించినట్లయితే వారిపై జాతీయ విపత్తు నిర్వహణ చట్టం -2015 మరియు IPC క్రింద క్రిమినల్ కేసులు నమోదు చేయబడును.

కావున దయచేసి ఈ సమాచారాన్ని అందరికీ చేరవేయలసిందిగ ప్రార్థన. కరోనాను నిరోధించడంలో సహకరించండి, మిమ్మల్ని కాపడుకొండి, మీతో పాటు సమాజాన్ని కాపాడండి.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *