TT Ads

నిరుద్యోగ యువతి యువకులకు స్వయం ఉపాధి అవకాశాలను కల్పించేందుకు గాను రాష్ట్ర వ్యాప్తంగా స్వేచ్ఛ ఈ – సేవా కేంద్రాలను ఏర్పాటు చేసుకునేందుకు ఆసక్తి గల అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు శనివారం ఓ ప్రకటనలో సి.ఈ.ఓ శ్రీధర్ పేర్కొన్నారు . స్వేచ్ఛ ఈ- సేవా కేంద్రాల నుండి ఆన్‌ లైన్ ద్వారా వివిధ రకాల బిల్లుల చెల్లింపులతో పాటు బస్సు , రైళ్లు , విమానాల టిక్కెట్లు బుకింగ్స్ , కొత్త పాన్ కార్డులు మరియు సవరణలు , అదే విధంగా వివిధ రకాల టెలికాం, పోస్ట్ పేయిడ్ , ప్రీ పేయిడ్ రీచార్జులు అన్ని బ్యాంకుల డబ్బు విత్ డ్రాలు , ఆధార్ ఆధారిత పనులు , వినియోగదారులకు మైక్రో ATM సేవలు , డేటా కార్డులు , ల్యాండ్ లైన్ బిల్లులు , DTH , బీమా , డిజిటల్ సిగ్నేచర్ , GST రిజిస్ట్రేషన్ , ఫాస్ట్ ట్యాగ్ తదితర ఆన్‌ లైన్ సేవలు అందించవచ్చని చెప్పారు . ఈ విధంగా ఆన్‌ లైన్ సేవలు అందిస్తూ స్వయం ఉపాధి పొందవచ్చన్నారు . ఎస్సీ , ఎస్టీ , ఓబీసీ , మైనార్టీలతో పాటు ఆర్థికంగా ఎనుకబడ్డ అభ్యర్థులు , వికలాంగులు , పదవీ విరమణ చేసిన వారు , మహిళలు తమ దరఖాస్తులను ఆన్‌ లైన్ ద్వారా సమర్పించుకోవచ్చని వివరించారు .33 శాతం రిజిస్ట్రేషన్ ఫీజుల ప్రత్యేక రాయితీ ఇవ్వబడుతుందన్నారు . దరఖాస్తులను www.swacheseva.com మార్చి నెల 30-3-2021వ తారీఖ్ లోగా అప్లై చేసుకోవాలని కోరారు . మరిన్ని వివరాలకు దరఖాస్తులకు
9154252666 ఫోన్ నెంబర్ ను సంప్రదించవచ్చని తెలిపారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *