TT Ads

ఆరోగ్యశ్రీ కింద రోగులను చేర్చుకొని చికిత్సనందించాలని ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని జిల్లా వైద్యాధికారి ఒకరు వివరణ ఇచ్చారు.దీన్ని యాజమాన్యాలు అమలు చేయాల్సిందేనన్నారు. కలెక్టర్లు ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నారని సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు.పది రోజుల వ్యవధిలో రాష్ట్రంలోని 38 సాంఘిక, 3 బీసీ సంక్షేమ గురుకులాల్లో కొత్త కేసులు నమోదయ్యాయి.కేసులు నమోదైనప్పుడు ఇతర విద్యార్థులకు పరీక్షలు చేయడంలోనూ జాప్యమేర్పడుతోంది.ఒక్కసారి 20 నుంచి 30 మందికి మాత్రమే పీహెచ్‌సీ సిబ్బంది పరీక్షలు చేస్తున్నారు. దీనివల్ల నియంత్రణ ఎలా సాధ్యమనే అభిప్రాయాలున్నాయి.మరోవైపు ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ జరుగుతున్నాయి. ఇందుకోసం విద్యార్థులు ఇతర కళాశాలలకు వెళ్లాలి.ఇతర ప్రాంతాల నుంచి బోధన, బోధనేతర సిబ్బంది వస్తుంటారు. కరోనా కేసులు పెరగడానికి ఇదీ ఓ కారణమని అధికారులు భావిస్తున్నారు.విశాఖ జిల్లా కృష్ణాపురం సాంఘిక సంక్షేమ గురుకులంలో ఓ విద్యార్థికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.అనంతపురం జిల్లా లేపాక్షి, పెనుకొండలోని బీసీ గురుకులాల్లో ఒక్కో విద్యార్థి కరోనా బారినపడ్డారు.చిత్తూరు జిల్లా పీలేరు గురుకులంలో ఓ విద్యార్థి కరోనా బారిన పడ్డారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *