TT Ads

నెల్లూరు జిల్లా:మనుబోలు, మార్చి 30: వెలుగు కార్యాలయంలో మనుబోలు సీసీ గా పనిచేస్తున్న శ్రీకాంత్‌ తనను వేధిస్తున్నాడంటూ స్థానిక దళితవాడకు చెందిన డ్వాక్రా మహిళ చలగల మంగమ్మ మంగళవారం విలేఖర్ల ఎదుట వాపోయింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన తల్లి ఆదిలక్ష్మి 2007 నుంచి ప్రశాంతి స్వయం సహాయక సంఘంలో సభ్యురాలిగా ఉందన్నారు. రుణం తీసుకున్న ఆదిలక్ష్మి గతేడాది డిసెంబరులో అనారోగ్యంతో చనిపోయింది. దీంతో రుణ బకాయిలు చెల్లించితే తల్లికి బదులుగా తనను ఆ గ్రూపులో సభ్యురాలిగా చేర్చుకుంటామని చెప్పడంతో కూలీకి వెళ్లి, తల్లి చేసిన బకాయిలు తీర్చింది. ఆ తర్వాత గ్రూపులో చేర్చుకోకపోగా.ప్రస్తుతం మంగమ్మ మరో గ్రూపులో ఉండగా అక్కడ తనను కావాలనే తొలగించేలా తీర్మానం చేయించి తీసేశారని ఆవేదన చెందింది. ఈ క్రమంలో నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న ఓ మహిళను చేర్చుకుని తనను ఏ గ్రూపులో చేరనీకుండా ఇబ్బంది పెడుతున్నాడని, అడిగితే నీ అంతు చూస్తానంటూ భయపెడుతున్నాడని మంగమ్మ ఆరోపించింది. ఈ సీసీ చాలామంది మహిళలను ఏదొక కారణాలతో ఇబ్బందులు పెడుతున్నాడని, కార్యాలయంలో తన మాటే ఏపీఎం సహా వినేలా చేస్తున్నారని బాధితురాలు పేర్కొంది. తనకు జరిగిన అన్యాయంపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేశానని తెలిపింది.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *