TT Ads

ఈ మధ్యన సంచలనం రేకెత్తించిన కీసర రాంపల్లి, RL Nagar అమ్మాయి కిడ్నాప్ కేసుతో సి సి కెమెరాల ప్రాధాన్యత మరోసారి అందరికి తెలిసివచ్చింది…సిసి కెమెరాలు కేవలం నేరస్తులను పట్టుకోవడములో మాత్రమే కాదు, అసలు నిజాలను వెలికితీసి , అమాయకులను కాపాడుతాయని నిరూపించాయి, సిసి కెమెరాలు మన ఇంటి ముందు, మన కాలనిలో, మన వార్డులో, మన గ్రామంలో , మన మున్సిపాలిటీలో ఏర్పాటు చేసుకోవడం అత్యంత అవసరం ఈ సంఘటన మనకు పాఠం నేర్పుతుంది.మన అమ్మ,చెల్లి,అక్క,అన్న మన స్నేహితుడు, మన పొరుగువాడు , మనము కష్టపడి సంపాదించుకున్న మన సంపాదన, ఆస్తులు ఇలా అందరూ మరియు అన్నీ బాగుండాలన్నా, భద్రంగా ఉండాలన్నా మనకు కెమెరాలు ఉండాలీసిందే..ఈ మాయదారి లోకంలో సిసి కెమెరాలే మనకు శ్రీరామ రక్ష..
మాట్లాడుకొనే సెల్ ఫోన్లకు, మెడలో వేసుకొనే బంగారు తాళ్లకు , ప్రతిరోజు సాయంత్రాలు కలిసే బీరు-బారులకు ప్లస్ దావతులకు వేలు, లక్షలు ఖర్చు పెడుతాము, మరి మన బాగు కోసం,మనందరి భద్రతకోసం కొంచమైనా ఖర్చు చేయలేమా ? నాకెందుకు అని యంనంపేట్ హోటల్ ఆయన అనుకోని ఉంటే ఇవాళ ఆ అమాయకులు ఆటో డ్రైవర్లు జైలు పాలు అయ్యేవారేమో? నాకెందుకు అని ఈశ్వరిపూరి కాలనీలోని NFC ఉద్యోగి అనుకోని ఉంటే దోస్తుకే 40 లక్షల కన్నం పెట్టిన మిత్రద్రోహి పోలీసులకి దొరికేవాడు కాడేమో ? వీల్లిద్దరూ నేను సైతం అని వాళ్ళయింటికి కెమెరాలు పెట్టుకొని, ఓ రెండు కెమెరాలు రోడ్డు వైపు పెట్టారు, ఫలితం, నిజాలు బయటపడ్డాయి, అమాయకులు రక్షించబడ్డారు, నేరస్తులు జైల్లో పడ్డారు..
అందరికి మరోసారి విన్నపం, సీసీ కెమెరాల ఏర్పాటు చేసుకొండి, మీ కాలనిలో, గ్రామంలో కెమెరాల ఏర్పాటుకు ఎంతో కొంత సహాయం చేయండి, చేసేవాళ్లను ప్రోత్సహించండి, ముఖ్యంగా నాయకులు బాధ్యత తీసుకొండి..
మన భద్రత గురించి ఆలోచించండి, మన భద్రతలోనే సమాజ భద్రత ఉన్నది అని గమనించండి, నేర రహిత సమాజం కోసం పోలీసులకు సహకరించండి.
-నరేందర్ గౌడ్ జవ్వాజి,

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *