TT Ads

కోయంబత్తూర్ (తమిళనాడు): మక్కల్ నీది మయం (ఎంఎన్ఎం)పార్టీ అధినేత, ప్రముఖ సినీనటుడు కమల్‌హాసన్ కుమార్తె, ప్రముఖ సినీనటి శ్రుతిహాసన్‌పై బీజేపీ ఫిర్యాదు చేసింది. మంగళవారం పోలింగ్ సందర్భంగా కమల్‌హాసన్ కుమార్తె, సినీనటి శ్రుతిహాసన్‌ తన తండ్రితో కలిసి కోయంబత్తూర్ సౌత్ నియోజకవర్గంలోని పోలింగ్ బూత్‌ను అక్రమంగా సందర్శించారని బీజేపీ ఫిర్యాదు చేసింది. కమల్ హాసన్, తన కుమార్తెలు శ్రుతిహాసన్, అక్షరలతో కలిసి చెన్నైలో ఓటు వేసిన తరువాత, నేరుగా తాను పోటీ చేస్తున్న కోయంబత్తూర్ సౌత్ నియోజకవర్గానికి వెళ్లారు. కోయంబత్తూర్ సౌత్ నియోజకవర్గ పోలింగ్ కేంద్రంలో  పోలింగ్ సరళిని పరిశీలించేందుకు కమల్ హాసన్ పోలింగ్ కేంద్రానికి వెళ్లారు.

తండ్రి కమల్ హాసన్ వెంట శ్రుతిహాసన్ పోలింగ్ కేంద్రంలోకి అక్రమంగా ప్రవేశించారని, దీనిపై ఆమెపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని బీజేపీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. శ్రుతిహాసన్ పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోయంబత్తూ సౌత్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి వసతి శ్రీనివాసన్ తరపున బీజేపీ జిల్లా అధ్యక్షుడు నందకుమార్ జిల్లా ఎన్నికల అధికారికి లేఖ రాశారు. పోలింగ్ కేంద్రంలోకి బూత్ ఏజెంట్లు తప్ప ఇతరులు పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లకూడదనే నిబంధన ఉందని, కాని ఈసీ నిబంధనను ఉల్లంఘించిన శ్రుతీహాసన్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *