TT Ads

ఖమ్మం : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు గారు ఈ మధ్య కాలంలో కరోనా బారిన పడ్డారని తెలిసి ఆయన త్వరగా కోలుకోవాలని పాస్టర్ జాన్ వెస్లీ గారితో చర్చిలో ప్రత్యేక ప్రార్థనలను టిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు మేడా విజయ్ కుమార్ నిర్వహించారు . తదనంతరం నిత్యం జ‌రిగే పూజ‌ల్లో సీయం కేసీఆర్ కు ఆరోగ్య సిద్ధి చేకూరాల‌ని , సంపూర్ణ ఆరోగ్యం , భగవంతుడి ఆశీస్సులతో త్వరలో కోలుకొని ఎప్ప‌టిలాగే ప్రజాసేవలో నిమగ్నమవ్వాలని విజయ్ కుమార్ ఆకాంక్షించారు . ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు చిలకమర్తి జోజి , ప్రభుకుమార్ , రమేష్ , శ్రీను తదితరులు పాల్గొన్నారు .

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *