TT Ads

పోలీస్ కమిషనర్ కార్యాలయం ఖమ్మం: ఎస్కార్ట్, బందోబస్తు,గార్డు వంటి కీలకమైన భాధ్యతలు నిర్వహిస్తున్న సిటీ ఆర్ముడ్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ యొక్క విధివిధానాలపై అవగాహన పెంపొందించేందుకురిఫ్రెష్ కోర్స్ ను నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్. వారియర్ పర్యవేక్షణలో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన 25 మంది ఏఆర్ పోలీస్ సిబ్బందికి 10 రోజుల పాటు ధీమాటిక్ కోర్స్ శిక్షణ తరగతులను ఈరోజు ప్రారంభించారు.

పోలీస్ శిక్షణ కేంద్రంలో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో అడిషనల్ డిసిపి మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో కీలకంగా వ్యవహరిస్తూ మానవీయ కోణంలో విధులు నిర్వర్తించాలని సూచించారు.ప్రతిఒక్కరూ స్వీయ క్రమశిక్షణతో ప్రవర్తించాలని తెలియచేశారు.ముఖ్యంగా బందోబస్తు ,ఖైదీల ఎస్కార్ట్, గార్డు డ్యూటీ చేసేటప్పుడు అనుసరించాల్సిన విధులు, అధికారులు అప్పగించిన భాధ్యతలు సక్రమంగా నిర్వహించడానికి తీసుకోవలసిన జాగ్రత్తలపై స్వయపరిశీలన సిబ్బందికి అవసరమని తెలిపారు.

బందోబస్తు విధులలోవ్యక్తుల ఆత్మ గౌరవాన్ని దెబ్బతినే విధంగా ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రవర్తించ వద్దని సూచించారు.
పోలీస్ శాఖ ఎన్నోవిప్లవాత్మక మార్పులు తేవడం ద్వారాఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని ఈ సందర్భంగా గుర్తుచేశారు. పోలీస్ సంక్షేమం / సెలవులు నియమాలు / MT సెక్షన్ విధులపై తరగతులు నిర్వహించారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *