TT Ads

సమాచార హక్కు చట్టం పైసూర్యాపేట జిల్లా అధికారులకు శిక్షణ ఇస్తున్నసమాచార హక్కు రక్షణ చట్టం రాష్ట్ర అధ్యక్షులు:డా. శ్యాం ప్రసాద్ గారు.

సమాచార హక్కు చట్టంపై అవగాహన కలిగి ఉండాలి.ఉద్యోగులకు రెండురోజుల శిక్షణా తరగతులు:ఏ.ఓ. శ్రీదేవి.

ఉద్యోగులు సమాచార హక్కు చట్టం – 2005 పై పూర్తి అవగాహన కలిగి ఉండాలని కలెక్టరేట్ ఏ.ఓ శ్రీదేవి అన్నారు.కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమాచార హక్కు చట్టం 2005 పై అన్ని శాఖల అధికారులు, సిబ్బందికి రెండు రోజుల శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయనైనదని అన్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డాక్టర్ మఱ్ఱి చెన్నారెడ్డి మానవ వనరుల శాఖ,అలాగే ప్రాంతీయ శిక్షణా కేంద్రం,నలగొండ వారి సంయుక్త ఆధ్వర్యంలో డా. శ్యాం ప్రసాద్ శిక్షణపై చట్టం యొక్క చారిత్రక అంశాలు, అధికార యంత్రాంగం తీసుకోవలసిన చర్యలు,పౌర సమాచార అధికారి పాత్ర,ఇతర నిబంధనలు తదితర అంశాలపై దాదాపు వివిధ శాఖల సిబ్బంది దాదాపు 50 మందికి చట్టంపై మొదటి రోజు అవగాహన కల్పించామని అన్నారు.ఈ శిక్షణా కార్యక్రమంలో వివిధ విభాగాల అధికారులు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *