TT Ads

విజయవాడ:సబ్సిడీ వేరుశనగ విత్తనాల పంపిణీ పై వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు సమీక్ష.వేరు శనగ విత్తనాలు రైతులకు సబ్సిడీ పై పంపిణీ చేస్తాం.ఈ నెల 10 వ తేదీ నుండి రైతుల రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.ఈ నెల 17 నుండి రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాలను అందిస్తాం.జూన్ 17 నాటికి వేరుశనగ విత్తనాల పంపిణీ పూర్తి చేయాలని సీఎం జగన్ ఆదేశించారు.సీఎం అదేశాలకు అనుగుణంగా విత్తనాల పంపిణీ కి ప్రణాళిక సిద్ధం చేశాం.రైతుల నుండే విత్తనాలు తీసుకుని ప్రాసెసింగ్ చేసి మళ్ళీ రైతులకు అందిస్తున్నాం.సీఎం జగన్ ఆదేశాలతో ఈ పద్ధతిని అమలు చేస్తున్నాం.గత ఏడాది విత్తనాల పంపిణీ ని గ్రామ స్థాయి నుండి ప్రారంభించాం.ఈ ఏడాది మరింత సమర్థవంతంగా విత్తనాలు పంపిణీ చేస్తాం.విత్తనాలు కోసం రైతులు రోడ్డెక్కి గంటల తరబడి ఎండలో నిలబడే పరిస్థితి గతంలో ఉండేది.సీఎం జగన్ ఆలోచనల తో రైతులకు ఇబ్బంది లేకుండా గ్రామాల్లోనే పంపిణీ చేస్తున్నాం.సుమారు 4 లక్షల 50 వేల క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు పంపినీ చేస్తాం.40 శాతం రాయితీ తో రైతులకు విత్తనాలు ఇస్తాం.ఈ సమీక్ష లో స్పెషల్ చీఫ్ సెక్రెటరీ పూనమ్ మాల కొండయ్య, వ్యవసాయ శాఖ కమిషనర్ అరుణ్ కుమార్, సీడ్స్ ఎండి శేఖర్ బాబు ఇతర అధికారులు పాల్గొన్నారు

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *