TT Ads

ఏపీ కోవిడ్-19(కమాండ్ కంట్రోల్): ప్రస్తుతం రోజుకు 10000, కాల్స్ ను అటెండ్ చేస్తున్నారు 104 లో.ముఖ్యంగా ఇందులో a) టెస్టింగ్ మరియు ఇతర విషయాల పైన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది.b) 1100 మంది డాక్టర్స్ టేలి కన్సల్టేషన్ ద్వారా ఎప్పటికప్పుడు కరోనా మీద అవగాహన కల్పించడమే కాకుండా వారు ఎలాంటి వైద్య సదుపాయం పొందాలి అనే విషయం మీద వాడవలసిన మందులు మీద కూడా తగు సూచనలు ఇస్తారు.c) హాస్పిటల్స్ తో సంప్రదించి అడ్మిషన్ ఇప్పించటంలో, పడకల విషయంలో, అంబులెన్స్ విషయం లో అన్ని విధాలుగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.d) Home ఐసోలేషన్ లో ఉన్నప్పుడు వైద్య సిబ్బంది రావటం సూచనలు ఇవ్వటం మరియు కిట్ ఇవ్వడం వరకు 104 ద్వారా చర్య తీసుకోబడుతుంది.104 కు కాల్ రాగానే టికెట్ రిజిస్టర్ చేస్తారు. వారి సమస్యలను నిర్ణీత సమయంలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అందుకు సంబంధించి ప్రతి జిల్లా కలెక్టరేట్ లో కూడా కాల్ సెంటర్ ఏర్పాటు చేయబడింది.జిల్లాలో ఉన్నటువంటి కాల్ సెంటర్ లో మూడు షిఫ్ట్ లలో 10+10+5 మంచి పని చేస్తూ ఉంటారు.ప్రతి డిస్ట్రిక్ట్ కాల్ సెంటర్ లో సీనియర్ అధికారులను నోడల్ ఆఫీసర్ గా నియమించారు.

ముఖ్యమంత్రి గారి ఆదేశాలనుసారం, కలెక్టర్ గారు స్వయంగా ప్రతినిత్యం 104 సెంటర్ ను విసిట్ చేయటం , వచ్చిన ప్రతి కాల్ ను విశ్లేషించడం మరింత సమర్థవంతంగా పనిచేసే విధంగా కాల్ సెంటర్ ను నిర్వహించవలసిందిగా మరొక్క మారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది.సాధ్యమైనంతవరకు 104 కు వస్తున్నటువంటి ప్రతి కాల్ ను జాగ్రత్తగా డీల్ చేసే విధంగా ప్రణాళిక సిద్దం చేయ బడినది.కరోనా ని ఎదుర్కోవడం లో 104 కాల్ సింగిల్ విండో సహాయ కారిగా ఉండాలని గౌరవ ముఖ్య మంత్రిగారు ఆదేశించారు. యంత్రాంగం ఆ దిశగా పని చేస్తోంది.రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రతి సూచనను ప్రజలు తమ వంతు బాధ్యతగా కరోనాని ఎదుర్కొనే దిశగా గుర్తించి సహకరించవలసినదిగా రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *