TT Ads

ఖమ్మం : మామిళ్లగూడెంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంచే ఆమోదింపబడ్డ శ్రీ గాయత్రి పొదుపు పరపతి , కన్జ్యూమర్ స్టోర్స్ పరస్పర సహాయక సహకార సంఘము ప్రథమ వార్షికోత్సవంలో కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు . సంఘ అధ్యక్షునిగా సీనియర్ న్యాయవాది శ్రీ ఊటుకూరు శ్రీనివాస చంద్రశేఖర్ , ప్రధాన కార్యదర్శిగా శ్రీ మారంరాజు రాధాకృష్ణా రావు , కోశాధికారిగా శ్రీ ముడుంబా శ్రీకాంత్ , కార్యనిర్వాహక కార్యదర్శిగా శ్రీ వైపిఎస్ రామయ్య , ఉపాధ్యక్షునిగా శ్రీ చేబ్రోలు సుబ్బారావు , సంయుక్త కార్యదర్శులుగా శ్రీ బైరవభట్ల రామకృష్ణ , శ్రీమతి నందుల వరలక్ష్మి ఎన్నికయ్యారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద , మధ్య తరగతి బ్రాహ్మణులలో పొదుపు కాంక్షను పెంచి , జిల్లా వ్యాప్తంగా వున్న బ్రాహ్మణుల ఆర్ధిక పురోభివృద్ధి కి చేయతనివ్వటానికి సత్సంకల్పంతో ఈ సొసైటీ ఏర్పడిందని జిల్లాలో వున్న బ్రాహ్మణులంతా సహాయ సహకారం అందించాలని కోరారు . జిల్లాలో పేద , మధ్య తరగతి బ్రాహ్మణులకు ఏ ఆపదొచ్చినా ముందుంటుందని తెలిపారు . ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు శ్రీమతి ఊటుకూరు విజయలక్ష్మి , మర్ల శేష భూషణ్ , పువ్వాడ పార్ధసారధి , శ్రీ కంకిపాటి సత్యనారాయణ , రజనీకాంత్ , జిల్లా బ్రాహ్మణ సంక్షేమ సంఘ అధ్యక్షుడు శ్రీ మంత్రి ప్రగడ జగన్మోహనరావు , నారపరాజు , నాగేశ్వరరావు , తుమ్మలపల్లి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు .

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *