TT Ads

శ్రీరామ నవమి నాడు భద్రాచలంలో స్వామి వారి కళ్యాణం జరుగుతుందని అందరికీ తెలిసిన విషయమే. ఆ కళ్యాణం లో ఉపయోగించే తలంబ్రాలకు ఒక ప్రత్యేకత ఉంది. ధాన్యపు వడ్లను రోలులో దంచో లేక మిల్లులో మర పెట్టినవి కావు. ఆడవారు తమ చేతి గోళ్లతో ఒక్కొక్క ధాన్యపు గింజను వలచిన బియ్యం. కనుక వీటిని ” గోటి తలంబ్రాలు ” అంటారు. అంతే కాదు ఈ తలంబ్రాలు కొరకు మరియు విత్తనాల వడ్లు కొరకు ప్రత్యేకంగా వరి సాగు చేస్తారు. తూర్పుగోదావరి జిల్లా అచ్యుతాపురం అనే గ్రామంలో. శ్రీరామ కళ్యాణ జరుగుతున్నప్పుడు తలంబ్రాలు తో పాటు వ్యవసాయానికి కావలసిన వడ్లను కూడా స్వామి వారి పాదాలు చెంత పెడతారు. ఆ వడ్లనే తిరిగి యధావిధిగా వరి సాగుకు వాడతారు. వరి పైరు పెరిగాక వరి కోతలు కోసేవారు విలక్షణంగా శ్రీరామ, లక్ష్మణ, హనుమంత, సుగ్రీవ మొదలగు వేష ధారణలో వచ్చి కోతలు సాగిస్తారు. వరికోత తో పాటు శ్రీరామ నామం జపిస్తూ సంబరాలు జరుపుతారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *