TT Ads

ప.గో.జిల్లా: వీరవాసరం మండలం దూసనపూడి గ్రామంలో నిన్న రాత్రి వైసీపీ, జనసేన వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో జనసేన పార్టీకి చెందిన గ్రామ సర్పంచ్ యర్రంశెట్టి నాగసాయి, వైసీపీ నాయకుడు సవరం కిషోర్‌లకు తీవ్ర గాయాలయ్యాయి.నిన్న ఉదయం పోలింగ్ కేంద్రం వద్ద జనసేన సర్పంచ్‌, వైసీపీ ఉప సర్పంచ్‌ల మధ్య వివాదం జరిగింది. గురువారం రాత్రి మరోసారి వివాదం తలెత్తడంతో ఇరువర్గాలకు చెందిన కార్యకర్తలు పరస్పర దాడులు చేసుకున్నారు. పూర్తి సమచారం అందవలసి ఉంది.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *