TT Ads

ఇది వైరా మేజర్ గ్రామ పంచాయతీ 2013 నుండి 2017 మధ్య కాలం బానోతు వాలీ సర్పంచ్ గా పదవికాలం కొనసాగింది. బానోతు వాలీ సర్పంచ్ హయాంలో వైరా పంచాయతీ పరిధిలోని నివాస గృహాలు, వ్యాపార సముదాయాల వంటికి పన్నుల రూపంలో పెద్ద మొత్తంలో పంచాయతీ సిబ్బంది వసూలు చేసిన సుమారు కోటి నలభై లక్షల రూపాయలు. అంతవరకు బాగానే ఉంది కానీ అసలు కథ ఇలా మైదలైంది కోటి నలబై లక్షలు ఎమైనవి ఆ సోమ్ము పంచాయతీ అభివృధ్ధికి గాని సిబ్బంది జీతాలకు వినియోగించారా అన్న ప్రశ్నకు సమాధానం లేదనే చెప్పాలి. పంచాయతీ లో ఏమి ఎంజరిగింది అన్నదే అందరి ప్రశ్న ప్రజల ఇంటి పన్నులు, వ్యాపార సముదాయాల నుండి వసూలు చేసిన సోమ్ము కాకి లెక్కలతో కొంతమంది సిబ్బంది కాజేశారు అనడంలో అతిశయోక్తి లేదు.

ఏమిజరిగిందో చూద్దాం పంచాయతీ సిబ్బంది అందులో ఒకరు బానోతు గాంధీలాల్ ఇతనికి సర్పంచ్ పిన్ని కావడంతో గాంధీలాల్ కు తనతో కొందరికి కాలం కలిసొచ్చింది.ఆడిందే ఆట పాడిందే పాట అన్న సందంగా తయారై కార్యలయంలో ఇంటి పన్నులు మిగితా వాటి వసూలు చేసిన మొత్తం సోమ్ము కాజేశారు. ఇందులో ఓ ప్రబుద్ధుడు గాంధీలాల్ ఏకంగా పంచాయతీ కార్యాలయం పేరుతో నకిలీ రషీద్ బుక్స్ తయారిచేసి కార్యలయం సోమ్ము స్వాహా చేయడం జరిగిన మాట వాస్తవమేనని తెలిసినా ఎవరు అడగలేదు ఎందుకంటే సర్పంచ్ తన మనిషి కావడమే తనకి కలిసొచ్చింది. పంచాయతీ ఆర్ధిక సమస్యలు ఎదుర్కొనడంతో సరిపడా సోమ్ములేక అప్పటి పంచాయతీ పరిధిలో పని చేసిన సిబ్బందికి కార్యాలయం జీతాలు చెల్లించలేక ఏకంగా 18 నెలలు బకాయి పడడం సిబ్బంది ఆందోనకు దిగి 20 రోజులపాటు సమ్మె చేయగా 12 నెలల జీతం నిక్కినిలిగి చెల్లించడం జరిగింది. మిగతా 6 నెలల జీతం కోసం నాటి నుండి నేటి వరకు ఎవ్వరిని అడిగినా దాటవేస్తున్నారే కాని పెండింగ్ జీవితం మాత్రం ఇవ్వలేదు ఇది వాస్తవం.

అసలేం జరిగింది అన్న కోణంలో ఎవ్వరు చూడలేదు పంచాయతీ కి రావాల్సిన సోమ్ము ఎమౌతుంది ఎవరు కాజేశారని ఎవ్వరూ పట్టించుకున్న పాపాన పోలేదు ఈ లోగా పంచాయతీ కాస్తా పురపాలక సంఘంగా రూపాంతరం చెందింది. పంచాయతీ లెక్కలు పత్రాలు తారుమారు తగలబడడం పంచాయతీ నుండి ఉన్న పైల్లు మాత్రమే ప్రభుత్వానికి అప్పగించడం జరింగింది. ఇంకెముంది మాయమైన సొమ్ము ను అడిగేవారు లేరు అడగలేదు అందరూ యదారాజ తదాప్రజ అన్నట్లు ఎవరిపని వాళ్ళు చేసుకుపోతున్నారు. మరి ప్రభుత్వం ఏచర్యలు తీసుకుంది మాయమైన రికార్డులు ఎమయినవి స్వాహా కాబడ్డ సొమ్ము రికవరి ఎందుకు చేయ్యలేదు.? అని అందరూ ఆలోచిస్తున్నారు. ప్రభుత్వ సొమ్ముకే రక్షణ లేకుంటే ఎలా కంచే చేను మేసిన చందంగా వైరా పురపాలక సంఘం పరిస్థితి తయారైంది.

బానోతు గాంధీ లాల్ అండ్ కో టీమ్ ఆధ్వర్యంలో నకిలీ రషీదులతో స్వాహా అయింది కోటి నలభై లక్షలేనా ఇంకా ఏమైనా ఉందా ఇంతతెలిసినా ప్రభుత్వం పంచాయతీ సోమ్ము కాజేసిన వారిని పురపాలక సంఘంలో ఎలా కొనసాగిస్తున్నారు. విరికి సహాకరిస్తుంది ఎవరు.? సొమ్ము కాజేసిన వారిలో ఎంతమంది ఉన్నారు. వారెవరు అన్నది ప్రభుత్వం నిగ్గు తేల్చాల్సి ఉంది. స్వాహా అయిన సోమ్ము ప్రభుత్వం రికవరి చేస్తుందా పంచాయతీ నాటి పెండింగ్ జీతాలు సిబ్బందికి చెల్లిస్తుందా లేదా? అవినీతికి పాల్పడితే ప్రభుత్వం ఏచర్యలు తీసుకుంటుంది.పంచాయతీ కి చెందిన కోటి నలభై లక్షల స్వాహా సోమ్ము కాజేసిన వారిని ఎంచేస్తుందని అందురూ ఎదురు చూస్తున్నారు.

.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *