TT Ads

తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి నలబై ఏళ్లయ్యిందని, చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే పగటి వేషగాళ్లు నిన్న ఒక డ్రామాను రక్తి కట్టించారు. ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన సందర్బంలో చాలా స్పష్టంగా చెప్పారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు. తెలుగుదేశం పార్టీని ఈ రాష్ట్ర ప్రజల సంపదగా నేను స్థాపిస్తున్నాను. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం, రాజకీయంగా ప్రాధాన్యత లేని అనేక అట్టడుగు వర్గాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని టిడిపిని స్థాపిస్తున్నానని ఆనాడు నందమూరి తారక రామారావు చెప్పారు.

ఎన్టీ రామారావు పార్టీ స్థాపించి, అధికారంలోకి వచ్చారు. అలా ఆ పార్టీలో అనేక వర్గాలు, కులాలు, జాతులు, అట్టడుగు వర్గాలను పైకి తీసుకువచ్చిన మహానుభావుడు ఎన్టీఆర్‌. ఆయన పేరు చెప్పి, ఆయనకు వెన్నుపోటు పొడిచి, ఆయన పార్టీని, సీఎం పదవిని లాక్కున్న నీచులు, ఆయనను దగా చేసిన దుర్మార్గులతో నేటి తెలుగుదేశం పార్టీ నిండిపోయింది. దొంగల పార్టీగా మారిపోయింది. చంద్రబాబుకు అండ్‌ కో సిగ్గు లేకుండా, ఎన్టీఆర్‌ ఆశయాలను, సిద్దాంతాలను తుంగలో తొక్కారు. ఎన్టీఆర్‌ను పార్టీ నుంచి తొలగించి, ఆయన సీఎం పదవిని దోచుకున్నారు. ఇప్పుడు సిగ్గు, శరం లేకుండా ఆయన బొమ్మలకు దండలు వేసి, ఆయన ఆశయాలకు పునరంకితం అవుతామంటూ దొంగమాటలతో పగటి వేషగాళ్ళ డ్రామాలను రక్తికట్టించారు.

ఇప్పుడు వున్న తెలుగుదేశం పార్టీని నడిపే వెన్నుపోటు దారుడు, కుట్ర రాజకీయదారుడు, దొంగ, అవినీతి చక్రవర్తి చంద్రబాబు ఏం చెబుతున్నాడు. ఎన్టీఆర్‌ సమాజామే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అంటే.. చంద్రబాబు అదే ప్రజలను ఏమంటున్నాడు?.. ప్రజలను దేవుళ్ళుగా కాదు.. కనీసం సామాన్య ప్రజలుగా కూడా గౌరవించలేని హీన స్థితికి దిగజారిపోయాడు. మొన్న జరిగిన మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో ప్రజలనుద్దేశించి ఏం మాట్లాడారో అందరికీ తెలుసు. ‘ప్రజలకు బుద్ధి లేదు. సిగ్గు లేదు. మీరు మనుషులేనా? మీరు బతికి ఉన్నా చచ్చిన వారితో సమానం. మందు, డబ్బు కోసం అమ్ముడు పోయేటువంటి మీ గురించి నేను పోరాంటం చేస్తుంటే.. మీరు బయటకు రారా.. మీరు మనుషులేనా, బతికివున్న వారితో సమానమేనా’ అంటూ దుర్భాషలాడాడు.

చంద్రబాబును గుడ్డిగా అభిమానించే వారు, ఆయన అవినీతిలో తాము కూడా భాగస్వాములు అయ్యే కొందరు టిడిపి నాయకులు కూడా ప్రజలపై ఇష్టారాజ్యంగా నోరు పారేసుకుంటున్నారు. సారాకు, డబ్బుకు అమ్ముడు పోతున్నారంటూ నోటికి ఏది వస్తే, అది మాట్లాడుతున్నారు. తమ తప్పుడు మాటలను ఎల్లో మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నారు. ప్రజలను చులకన చేసి మాట్లాడితే సహించేది లేదు. నోరు జారి మాట్లాడే టిడిపి నేతలు ఒళ్ళు దగ్గరపెట్టుకోవాలి. సీఎం శ్రీ వైయస్‌ జగన్‌కు అండగా నిలిచిన పేద, అణగారిన వర్గాల పట్ల చులకన భావంతో, కించపరిచేలా మాట్లాడితే తగిన సమాధానం చెబుతాం.

ఈ రాష్ట్రంలో అప్పులు పెరుగిపోయాయని, సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ గారు అప్పులు తెచ్చి ప్రజలకు డబ్బులు పంచుతున్నారని చంద్రబాబు, ఆయన అనుయాయులు విమర్శలు చేస్తున్నాడు. చంద్రబాబు సీఎంగా వుండి ఈ రాష్ట్రానికి మూడు లక్షల అరవై వేల కోట్లు అప్పులు తెచ్చాడు. ఏ ఒక్క పేదవాడికి ఈ డబ్బు పంచలేదు. తన ప్రచారానికి, కీర్తికి ఆ అప్పుల సొమ్మును ఖర్చు చేశాడు. తన దుబారాలకు ఈ రాష్ట్ర ప్రయోజనాలను ఫణంగా పెట్టాడు. ఇప్పుడు సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ గారు తొంబై వేల కోట్లు అప్పులు తెచ్చాడని చంద్రబాబు విమర్శిస్తున్నాడు. తెచ్చిన ఈ అప్పులను కోవిడ్‌ సమయంలో పేదలకు ఎలా ఖర్చు చేశారో చంద్రబాబుకు తెలియదా? పనులు లేక పేదలు పస్తు వుండే పరిస్థితి రాకుండా ఒక తండ్రిస్థానంలో వుండి ఆలోచించి మరీ ఖర్చు చేశారు. ఇలాంటి మంచి గుణం చంద్రబాబుకు లేదు.

ప్రజల పట్ల సీఎం శ్రీ వైయస్‌ జగన్‌కు ఉన్న చిత్తశుద్దికి నిదర్శనమే ఇటీవల జరిగిన పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికల్లో సాధించిన అఖండ విజయం. ఈ రాష్ట్రంలో ప్రజలు ఆకలితో అలమటిస్తుంటే.. వారిని ఆదుకునేందుకు అప్పులు చేసినంత మాత్రాన రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేస్తామనే ప్రచారం దారుణం. ఈ అప్పులను తీరుస్తాం. అలాగే రాష్ట్రాన్ని అభివృద్దిలో ముందుకు తీసుకువెళ్ళే సత్తా కూడా జగన్‌ గారికి వుంది. ఈ రాష్ట్రానికి ఇటువంటి సీఎం దొరికినందుకు ప్రజలు అంతా అభినందిస్తున్నారు. చంద్రబాబు లాంటి వారు మాత్రం ఏడుస్తున్నారు.

ఎబిఎన్‌ రాధాకృష్ణ, టివి5 బిఆర్‌ నాయుడు, ఈనాడు రామోజీరావులు పాతాళంలో వున్న చంద్రబాబును మళ్ళీ పైకి ఎత్తేందుకు నానా తంటాలు పడుతున్నారు. తమ మీడియాలో చంద్రబాబుకు అనుకూలంగా, ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాధ్యమైనంత ప్రచారం చేస్తున్నారు. ఈ ఎల్లో మీడియా చేస్తున్న విష ప్రచారాన్ని ప్రజలు పట్టించుకునే స్థితిలో లేరు. తిన్నింటి వాసాలు లెక్కపెట్టే రకం చంద్రబాబుది. ప్రజల గురించి ఆలోచిస్తూ, ప్రజలకు మంచి చేయాలని నిత్యం తపించే వ్యక్తి సీఎం శ్రీ వైయస్‌ జగన్‌. ఎల్లో మీడియా ద్వారా ఎంత విషం చిమ్మినా జగన్‌ గారి చిటికెల వేలును కూడా కదపలేరు.

తిరుపతి ఎంపి ఉప ఎన్నికల్లో అయిదు లక్షల ఓట్లకు పైగా మెజారిటీతో వైయస్‌ఆర్‌సిపి విజయం సాధిస్తుంది. మతం పేరుతో, దేవుడి పేరుతో రాజకీయం చేసి లబ్ధి పొందాలని ప్రయత్నించే పార్టీలకు పుట్టగతులు వుండవు. జాతీయ పార్టీ అని చెప్పుకునే ఒక పార్టీ నోటా కంటే ఎక్కువ ఓట్లు వస్తే చాలు అని తంటాలు పడుతోంది. మరోపార్టీ డిపాజిట్‌ దక్కించుకునే ఓట్లు అయినా రావాలని, తమ పరువు నిలబడితే చాలు అని కంగారు పడుతోంది. శ్రీ వెంకటేశ్వర స్వామిని, పవిత్రమైన తిరుమలను సైతం వివాదాల్లోకి లాగి ఓట్ల రాజకీయం చేయాలని అనుకుంటున్న పార్టీలు శ్రీవారి ఆగ్రహానికి గురి కాక తప్పదు. అన్ని కులాలు, మతాలకు సమాన గౌరవం, ఆదరణ చూపుతున్న వైయస్‌ఆర్‌సిపికి వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం తప్పకుండా వుంటుంది.

ఈ రాష్ట్రానికి సీఎంను చేసే శక్తి బిజెపికి వుంటే.. వారి పార్టీ నుంచే ఆ పదవికి ఎంపిక చేస్తారు కానీ వేరే ఎవరినో చేయాలని అనుకోరు. తిరుపతి ఎన్నికల్లో లబ్ధి పొందాలని, అమాయకులను మోసం చేయాలని, మాయ చేయాలనే ప్రయత్నాలలో ఇది భాగం. టిడిపి నేత యనమల రామకృష్ణుడిని ప్రజలు అయిదు సార్లు ఓడించినా ఆయనకు బుద్ది రాలేదు. ఎప్పుడూ ఏదో ఒక విషం చిమ్మడానికి సిద్దమవుతూ వుంటాడు. జగన్‌ గారి పాలనకు ఆటంకాలు కలిగించాలని నిత్యం తపిస్తూ వుంటాడు.

రాష్ట్రం విడిపోవడానికి కారణం చంద్రబాబు. ఆనాడు కేసిఆర్‌ టిడిపి నుంచి బయటకు పోవడానికి కారణం చంద్రబాబు. ఈ రాష్ట్రం రెండు ముక్కలు అవ్వడానికి, ఎపి ఇటువంటి ఇబ్బందులకు గురి కావడానికి కారకుడు చంద్రబాబు. గతంలో ఎకరం ఇరవై లక్షలకు దొరికే పొలాలు నేడు అమరావతి మినహా పది లక్షల రూపాయలు కూడా పలకడం లేదు. అమరావతి ప్రాంతంలో ఎకరం ఇరవై లక్షలు పలికే పొలాలు ఏకంగా అయిదు కోట్ల రూపాయలకు రేట్లు పెరిగిపోయాయి. ఈ అసమతుల్యతకు కారణం చంద్రబాబు. అధికారాన్ని, అభివృద్ధిని కేంద్రీకృతం చేసి, మిగిలిన ప్రాంతాలకు అన్యాయం చేశాడు. వైయస్‌ రాజశేఖరరెడ్డి గారు ప్రారంభించిన జలయజ్ఞంలోని ప్రాజెక్ట్‌లను నిర్లక్ష్యం చేసి రైతుల ఉసురు పోసుకున్నాడు. ఆ తప్పును సవరించేందుకే సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ అధికారాన్ని, అభివృద్ధిని వికేంద్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే దాన్ని కూడా అడ్డుకునేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *