TT Ads

ఓటమికి సాకులు వెతుక్కుంటూ, దొంగ ఓట్లు అంటూ కుట్ర ,అసలు దొంగ ఓట్లు వేయించుకోవాల్సిన అవసరం మాకు లేదు, మున్సిపల్‌ ఎన్నికల్లో కూడా వైయస్సార్‌సీపీకి అద్భుత విజయం అదే స్ఫూర్తితో తిరుపతి ఎన్నికలో కూడా ప్రజలు గెలిపిస్తారు .అందువల్ల దొంగ ఓట్లు, అక్రమాలపై కుట్ర అవసరం లేదు అదంతా టీడీపీ, చంద్రబాబు సొంతం. పక్కా ప్రణాళికతో ఈ కుట్ర వైయస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడి.

తిరుపతికి రోజూ లక్షలాది భక్తులు, పర్యాటకులు, యాత్రికలు వేల సంఖ్యలో బస్సులు, వాహనాలు వస్తాయి. అందుకే తిరుపతిని వేదికగా ఎంచుకుని కుట్ర చేస్తున్నారు. బస్సుల్లో వస్తున్న భక్తులు, యాత్రికులను నిలదీస్తున్నారు వారు దొంగ ఓటర్లు అంటూ దారుణంగా అవమానిస్తున్నారు. ఓటమి తప్పదన్న ప్రతి సారి చంద్రబాబు ఈ తరహా కుట్రలు సరిగ్గా ఇప్పుడు కూడా అదే పనిగా కుట్ర చేస్తున్నారు. కానీ ప్రజలు నమ్మరు వారు సీఎం వెంటనే ఉన్నారు ఎన్నిసార్లు ఎన్నికలు జరిగినా మా పార్టీదే ఘన విజయం. ఇంకా మెజారిటి పెరుగుతుంది తప్ప, అస్సలు తగ్గదు ప్రెస్‌మీట్‌లో శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టీకరణ.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *