TT Ads

జమ్మలమడుగు:మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో తనకు సంబంధం ఉంటే ఎక్కడైనా బహిరంగంగా ఉరి తీయొచ్చని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదినారాయణరెడ్డి స్పష్టం చేశారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా మంగళవారం పలు గ్రామాల్లో పర్యటించారు. ఎస్‌.ఉప్పలపాడు, పెద్దపసుపుల గ్రామాల్లో ఆయన మాట్లాడుతూ  వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వివేకానందరెడ్డి 2019, మార్చి 15న అనుమానాస్పద స్థితిలో చనిపోయారని చెప్పారు. ప్రస్తుతం సీబీఐ విచారణ జరుగుతోందని ఇంకా తనపై అనుమానం ఉందంటే దిల్లీలోని సీబీఐ కార్యాలయం ఎదుట ఇరు కుటుంబాలకు చెందిన సభ్యులు ధర్నాకు కూర్చోవాలన్నారు. విచారణ ముగిసిన తర్వాత హత్యకు ఎవరు పాల్పడ్డారో వారిపై అక్కడే చర్యలు తీసుకోవాలని సూచించారు. వివేకా హత్య కేసులో సీఎం వైఎస్‌ జగన్‌ కుటుంబ సభ్యులు చేస్తున్న ఆరోపణలన్నీ పూర్తిగా అవాస్తవమని ఖండించారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *