TT Ads

విశాఖలో పరిపాలనా రాజధానికి కౌంట్ డౌన్ మొదలైంది. రాజధానికి సంబంధించిన కార్యాలయాల ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. ఈ మేరకు అధికారులు బరిలోకి దిగిపోయారు.పాలనా రాజధానికి అనుకూలమైన భవనాల వేట ఇపుడు విశాఖలో జోరుగా సాగుతోంది. ఎక్కడ ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి అనువుగా ఉంటుంది అన్నది కూడా అంచనా వేస్తున్నారు.అదే సమయంలో మధురవాడ నుంచి భీమునిపట్నం దాకా ఉన్న ప్రాంతాలను కూడా పరిశీలిస్తున్నారు. ఇక్కడ అనేక చోట్ల రాజధాని భవనాల‌కు అనుకూలంగా ఉన్నట్లుగా అధికారులు ఈసరికే గుర్తించారు అని తెలుస్తోంది

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *