TT Ads

వైద్య ఆరోగ్య శాఖ అధికారులను అప్రమత్తం చేసిన మంత్రి ఆళ్ల నాని.ఆంధ్ర యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులకు 65మందికి కరోనా నిర్ధారణ,విశాఖపట్నం జిల్లా DMHO డాక్టర్ సూర్యనారాయణతో ఫోన్ లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్న మంత్రి ఆళ్ల నాని,ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ క్యాంపస్ లో 1500వందల మందికి కరోనా పరీక్షలు చేయగా 65మందికి కరోనా నిర్ధారణ అయ్యింది.మహిళల హాస్టల్ లో 500మందికి శనివారం కరోనా పరీక్షలు చేస్తే 200మందికి నెగెటివ్ వచ్చింది.మిగిలిన 300మంది ఇంజనీరింగ్ మహిళ విద్యార్థునుల కరోనా రిపోర్ట్ రావాలసిన అవసరం ఉంది.ప్రతి రోజు 7వేల 5వందలు వరకు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నాం,విశాఖపట్నం జిల్లాలో 6కోవిడ్ హాస్పిటల్స్ ఏర్పాటు చేసాం.విశాఖపట్నంలో KGH హాస్పిటల్, అనకాపల్లి,విమ్స్ నర్సీపట్నం, పాడేరు, అరకు హాస్పిటల్స్ కరోనా బాధితుల కోసం 1000బెడ్స్ సిద్ధం చేసాం.కరోనా సోకిన బాధితులు ప్రస్తుతం KGH హాస్పిటల్ లో 15మందికి మెరుగైన వైద్యం అందిస్తున్నాం.రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వైద్య ఆరోగ్య శాఖ అధికారులను అప్రమత్తం చేసాం,ప్రతి రోజు ఉదయం అన్ని జిల్లాల DMHO, DCHS, గవర్నమెంట్ హాస్పిటల్స్ సూపరింటెండెంట్స్ తో కరోనా నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలపై టెలి కాన్ఫరెన్స్ లో సమీక్షిస్తున్న మంత్రి ఆళ్ల నాని.మార్కెట్లు, వారంతపు సంతలు, ప్రజా రవాణా లో కరోనా వైరస్ వ్యాప్తికి అవకాశం ఉన్న ప్రదేశాల్లో కరోనా నిబంధనలు తప్పనిసరిగా అమలు చేస్తున్నాం,ప్రభుత్వ కార్యాలయలు, ప్రవేశ ప్రాంతంలో తప్పనిసరిగా ధర్మల్ స్కానింగ్, శానిటైజర్ వినియోగించాలి.65సంవత్సరాలు దాటిన వారు,ధీర్గ కాలిక వ్యాధులు ఉన్న వారు, గర్భవతులు,10సంవత్సరాలలోపు పిల్లలు జాగ్రత్తలు తీసుకోవాలి.కరోనా పాజిటివ్ తెలిన వ్యక్తిని 14రోజులు ముందు కలిసిన వారిని క్వారంటైన్ లో ఉంచాలి,కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినతర్వాత హోమ్ ఐసోలేషనులో ఉంచుతున్నాం,పని ప్రదేశాలు, బహిరంగ ప్రాంతాలు,ప్రయాణం సమయంలో తప్పకుండా మాస్క్ ధరించడానికి చర్యలు చేపట్టాం.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *