TT Ads

భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) ఖమ్మం జిల్లా ఆధ్వర్యంలో స్థానిక ప్రజా సంఘాల కార్యాలయం సుందరయ్య భవన్లో రాష్ట్ర అధ్యక్షులు ఆర్, ఎల్, మూర్తి అధ్యక్షతన జిల్లా కార్యదర్శిల సమావేశం నిర్వహించడం జరిగింది.

ఈ సందర్బంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి తాళ్ల నాగరాజు మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం విద్యా సంస్థలు మూసివేసి పేద విద్యార్థులకు ప్రభుత్వ విద్యను ద్వారం చేసింది.కరోనా వ్యాప్తి ఉన్న విద్యాసంస్థలను కంటోన్మెంట్ జోన్లుగా మార్చి మూసివేసి మిగతా విద్యాసంస్థలను కోనసాగించాలి అన్నారు.యూనివర్సిటీ లో కోచింగ్ సెంటర్లు ఓపెన్ చేయాలని, ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.విద్యార్థుల ప్రాథమిక హక్కును విద్యార్థులకు దూరం చేసింది అన్నారు.దేశ వ్యాప్తంగా విద్యా సంస్థలు నిర్వహిస్తున్న, రాష్ట్రంలో కరోనా పేరుతో విద్యార్థులకు చదువులను దూరం చేయడం దుర్మాగం అన్నారుకరోనా నివారణకు ప్రత్యేక నిధులు ప్రతి ప్రభుత్వ విద్యాసంస్థకు కేటాయించాలి.ప్రభుత్వం ప్రతి విద్యాసంస్థకు ఆరోగ్య కార్యకర్త మరియు క్లీనింగ్ సిబ్బందిని నియమించాలి, విద్యాసంస్థలలో ప్రతిరోజ శానిటేషన్ చేసి ఉచితంగా మాస్కులు,శానిటైజర్స్, హ్యాండ్ వాష్ చేసేలా చర్యలు చేపట్టాలి.చదువుకుంటన్న పేద,మధ్య తరగతి విద్యార్థులకు చదువును బలవంతంగా దూరం చేయటం అంటే విద్యారంగంపట్ల వారికున్న ప్రేమ అర్థమవుతుంది అన్నారు.ఎన్నికల ప్రయోజనం కోసం కాకుండా విద్యార్థులకు చదువు అందని ద్రాక్షలా ఉందని అన్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు ఎస్ఎఫ్ఐ ఖమ్మం జిల్లా కార్యదర్శి అశోక్ జమ్మి, రాష్ర్ట కేంద్రం బాధ్యులు తాటికొండ, రవి సాగర్, సాయి, మల్లేష్, రజిని, రజినీకాంత్, జహీద్, ప్రశాంత్, రంజిత్ కుమార్ ,సంతోష్, ఎస్ఎఫ్ఐ ఖమ్మం జిల్లా గల్ఫ్ కన్వీనర్ సరళ, మధు, ప్రవీణ్, సుధాకర్, సాయి తదితరులు పాల్గొన్నారు..

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *