TT Ads

విద్యారంగంలో మరో కీలక నిర్ణయాన్ని తీసుకున్న ప్రభుత్వం,అటానమస్‌ కాలేజీల్లో పరీక్షల విధానంలో మార్పులు అటానమస్‌ కాలేజీలే సొంతంగా ప్రశ్నపత్నాలు తయారు చేసుకునే విధానం రద్దు అన్ని కాలేజీల కీ జేఎన్‌టీయూ తయారు చేసిన ప్రశ్నపత్రాలే అటానమస్, నాన్‌ అటానమస్‌ కాలేజీలకు ఇవే ప్రశ్నపత్నాలు వాల్యూయేషన్‌ కూడా జేఎన్‌టీయూకే పరీక్షల్లో అక్రమాల నిరోధానికే చర్యలు డిగ్రీలు సాధించిన తర్వాత ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఉండాలి.నైపుణ్యం లేకుండా ఇంటర్వ్యూలు కూడా ఎదుర్కోం లేం, ప్రతి విద్యార్థీ నైపుణ్యంతో, సబ్జెక్టుల్లో పరిజ్ఞానంతో ముందుకు రావాలి.ప్రతి కోర్సుల్లో అప్రెంటిస్‌ విధానం తీసుకురావాలని అందుకే నిర్ణయించాం.కనీస అనుభవం, పరిజ్ఞానం లేని డిగ్రీలకు విలువ ఏముంటుంది.విద్యార్థులు తాము చదువుతున్న కోర్సుల్లో నచ్చిన సబ్జెక్టులను ఎంపిక చేసుకునే అవకాశం ఉండాలి: సీఎం

కొత్త కొత్త సబ్జెక్టులను వారికి అందుబాటులో ఉంచాలి,అభివృద్ధి చెందిన దేశాల్లో డిగ్రీ విద్యావిధానాన్ని పరిశీలించండి అధికారులకు సీఎం ఆదేశం.విశాఖపట్నంలో మంచి డిగ్రీ కాలేజీ తీసుకురావాలని సీఎం ఆదేశం ఆర్ట్స్‌లో మంచి సబ్జెక్టులను ఈ కాలేజీలో ప్రవేశపెట్టాలని సీఎం ఆదేశం

జగనన్న విద్యా దీవెన, వసతి దీవెనపై సీఎం సమీక్ష,

ఏప్రిల్‌ 9న జగనన్న విద్యాదీవెన కింద ఫీజురీయింబర్స్‌మెంట్, ఏప్రిల్‌ 27న వసతిదీవెన విడుదలపై అధికారులతో సీఎం సమీక్షఈ ఏడాది నుంచి తల్లుల ఖాతాల్లో జగనన్న విద్యా దీవెన డబ్బులు దాదాపు 10 లక్షలమందికి పైగా విద్యార్థులకు లబ్ధిఈ ఏడాది డిగ్రీ అడ్మిషన్లలో 50వేల వరకూ పెరుగుదల వచ్చిందన్న అధికారులు విద్యాదీవెన ద్వారా తల్లిదండ్రుల్లో చదువులకు ఇబ్బంది రాదనే భరోసా వచ్చిందన్న అధికారులు అందుకనే గత ఏడాదితో పోలిస్తే డిగ్రీ అడ్మిషన్లు 2.2 లక్షల నుంచి 2.7లక్షలకు పెరిగిందని సీఎంకు వెల్లడించిన అధికారులు.

ఈ సంవత్సరం భర్తీచేయనున్న పోస్టులపై క్యాలెండర్‌ సిద్ధంచేయాలని అధికారులకు సీఎం ఆదేశం.ఉగాది రోజున క్యాలెండర్‌ విడుదల చేసేలా చూడాలన్న సీఎం,ఈ ఏడాది 6 వేలమంది పోలీసు నియామకాలు చేయాలని సీఎం ఆదేశం ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీలకు కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పనకు వీలైనంత త్వరగా నిధులను విడుదల చేయాలని సీఎం ఆదేశం



TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *