TT Ads

విజయవాడ: విజయవాడలో అధికారులు నేడు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. కనకదుర్గమ్మ వారధి వద్ద రక్షణ గోడకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ ట్రాఫిక్ ఆంక్షలు అమలు కానున్నాయి. చెన్నై, విశాఖ వెళ్ళే వాహనాలను ఒంగోలు, అవనిగడ్డ తాళ్లపల్లి, పామూరు మీదుగా మళ్లించనున్నారు. ఏలూరు, హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలు హనుమాన్ జంక్షన్, నూజివీడు, ఇబ్రహీంపట్నం మీదుగా మళ్లించనున్నారు. ఉదయం 9:00 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కనకదుర్గమ్మ వారధి పైకి ఎటువంటి వాహనాలను అనుమతించరు. గుంటూరు… విజయవాడ మధ్య మధ్యాహ్నం వరకూ రాకపోకలను ప్రకాశం బ్యారేజ్ మీదుగా మళ్లించారు

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *