TT Ads

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మహిళా సాధికారతకు తూట్లు పొడిచింది,మహిళ బిల్లుపై గత ప్రభుత్వం అన్యాయం చేసింది మేము అధికారంలోకి వస్తే బిల్లును పాస్ చేస్తామని చెప్పారు.బీజేపీకి లోక్ సభలో సంపూర్ణ మెజార్టీ ఉంది, రాజ్యసభలో మహిళ బిల్లుకు అన్ని పార్టీలు మద్దతు ఇస్తున్నాయి.బీజేపీ అధికారంలోకి వచ్చి దాదాపు 7 సంవత్సరాలు అవుతున్నా మహిళా బిల్లుపై నోరు విప్పడం లేదు.మాహిళలపై దాడుల్లో భారతదేశం ప్రధమ స్థానంలో ఉండటం సిగ్గుచేటు.కేంద్రంలో బీజేపీ సర్కార్, రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం రెండు కూడా మహిళలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నాయి.మహిళలపై దాడి జరిగితే గన్ కంటే ముందు జగన్ వస్తాడని అసెంబ్లీలో ప్రగల్భాలు పలికారు.ఎన్నికల ముందు మహిళలకు అండగా ఉంటామని నమ్మించి అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల పట్ల వివక్ష చూపుతున్నారు.కేంద్ర, రాష్ట్ర వైఫల్యాల వల్లే కరోనా వైరస్ విలయతాండవం చేస్తూ ప్రజల ప్రాణాలు తీస్తోంది.మేము లేఖ రాయడం వల్లే ప్రధాని నరేంద్ర మోదీ ఉచిత వ్యాక్సిన్ ఇస్తున్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు.అయితే థర్డ్ వేవ్ ఉన్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా చిన్న పిల్లలకు, మహిళలందరికి ఉచితంగా వ్యాక్సిన్ వేయాలని ప్రధానికి లేఖ రాయండి.మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా ఆమోదించమని ప్రధానికి ముఖ్యమంత్రి జగన్ లేఖ రాయాలి

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *