TT Ads

వారధి నుంచి కోటినగర్ వరకు 1.5 కి.మీ.పొడవునా వరద రక్షణ గోడ,రూ.125 కోట్లతో రిటైనింగ్ వాల్ నిర్మాణం,మార్చి 31న నిర్మాణపనులకు శంకుస్థాపన చేయనున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.స్థలాన్ని పరిశీలించిన దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్,సియం కార్యక్రమాల కో ఆర్డినేటర్ తలశిల రఘురామ్, జిల్లా కలెక్టర్ ఏ.యండి.ఇంతియాజ్, నగర పోలీసు కమిషనర్ బత్తిన శ్రీనివాస్, వియంసి కమీషనర్ వి.ప్రసన్న వెంకటేష్, సబ్ కలెక్టర్ హెచ్ యం ధ్యానచంద్ర,వైఎస్ ఆర్ సిపి నాయకులు దేవినేని అవినాష్,బొప్పన భవకుమార్,ఇరిగేషన్ అధికారులు.అధికారులకు పలు సూచనలు చేసిన సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురాం, మంత్రి వెల్లంపల్లి, ఎమ్మెల్యే మల్లాది విష్ణు.

ఎన్నో సంవత్సరాల గా ఇబ్బంది పడుతున్న కృష్ణలంక కట్ట ప్రాంతాల ఇబ్బంది మా ప్రభుత్వం తీరుస్తుంది.ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట ప్రకారం రిటైనింగ్ వాల్ నిర్మాణానికి ప్రాణానికలు సిద్ధం అయ్యాయి.రానున్న రోజుల్లో కరకట్ట వాసులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా శాశ్వత పరిష్కారం చేస్తున్నాము.నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి ఈ నెల 31న శంకుస్థాపన చేస్తారు.గత ప్రభుత్వం రిటైనింగ్ వాల్ నిర్మాణం పేరుతో కాలయాపన చేసింది.రిటైనింగ్ వాల్ నిర్మాణాన్ని కూడా కొంత మంది ప్రతిపక్ష నాయకులు రాజకీయం చేస్తున్నారు.వారు ఎంత అడ్డుపడిన రిటైనింగ్ వాల్ నిర్మాణం చేసి తీరుతం.

మల్లాది విష్ణు మాట్లాడుతూ :గత ప్రభుత్వం చేయలేని పని మేము చేసి చూపుతాo.ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయవాడ అభివృద్ధి పైన ప్రత్యేక దృష్టి సారించారు.ఎన్నో సంవత్సరాల గా వరదలతో ఇబ్బంది పడుతునం కృష్ణలంక కరకట్ట వాసుల కష్టాలు తీరుతాయి.దాదాపు 125 కోట్లతో రిటైనింగ్ వాల్ నిర్మాణం ప్రభుత్వం చేపడుతోంది.మా ప్రభుత్వం చేస్తున్న అభివృది చూసి ప్రతిపక్ష నాయకులు ఓర్వలేకపోతున్నారు.వారు ఎంత అడ్డుపడిన తమ ప్రభుత్వం విజయవాడ అభివృద్ధి చేసి తీరుతుంది.

ఏ.యండి.ఇంతియాజ్, కలెక్టర్ కృష్ణజిల్లా మాట్లాడుతూ:కృష్ణలంక కరకట్ట నిర్మాణానికి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈనెల 31న శంకుస్థాపన చేస్తారు.125 కోట్ల రూపాయలు ప్రభుత్వం రిటైనింగ్ వాల్ నిర్మాణానికి కేటాయించింది.ఈ రిటైనింగ్ వాల్ నిర్మాణం వలన కరకట్ట ప్రాంత వాసులకు వరదల నుంచి శాశ్వత పరిష్కారం దొరుకుతుంది.సీఎం రాక సందర్భంగా ఏర్పాట్లను పరిశీలించాము,వరదలు వచ్చినప్పుడలా ఈ రిటైనింగ్ వాల్ లేకపోవడం వలన కరకట్ట ప్రజలు ఆర్ధికంగా చాలా నష్టపోతున్నారు.ఇక మీదట వరదల వలన కరకట్ట ప్రజలు ఎవరూ నష్టపోకూడదు అని ప్రభుత్వం వెంటనే రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపడుతుంది.ఈ రక్షణ గోడ నిర్మాణం పూర్తి అయితే కృష్ణలంక,దిగువన ఉన్న మూడు వేల కుటుంబాల తోపాటు నగర వాసులకు ఎటువంటి వరద భయం వుండదు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *