TT Ads

లైబ్రరీ భవనంలో కోవిడ్ రోగుల కోసం 160 అదనపు పడకలతో సిద్ధం చేసిన కొత్త వార్డును ప్రధాన కార్యదర్శి పరిశీలించారు. ఇది త్వరలో ప్రారంభించబడుతుంది.ఈ సందర్భంగా గాంధీ ఆసుపత్రి నందు అందిస్తున్న చికిత్స సదుపాయాలను ప్రధాన కార్యదర్శి పరిశీలించారు. తదుపరి ఆసుపత్రి వైద్యులు, సిబ్బందితో మాట్లాడారు. ఉత్తమ సేవలు అందిస్తున్నారని వైద్యులను ఆయన అభినందించి, కృతజ్ఞతలు తెలిపారు.రోజుకు 4 మెట్రిక్ టన్నుల సామర్ద్యంతో నెలకొల్పి, నేటి నుండి పనిచేస్తున్న కొత్త ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ను ప్రధాన కార్యదర్శి తనిఖీ చేసారు. ఈ కొత్త ఆక్సిజన్ ప్లాంట్ 400 మంది పేషంట్లకు సరిపడ ఆక్సిజన్ ను అందిస్తుంది.

రోగులకు మెరుగైన సౌకర్యాలు కల్పించుటకై క్లీన్ లినేస్స్ డ్రైవ్ కింద చేపట్టిన పారిశుధ్యం, వీధి దీపాలు, ఆక్సిజన్ పైప్లైన్ పనులను ప్రధాన కార్యదర్శి పరిశీలించారు. ఈ పనులను వేగంగా పూర్తి చేయాలని ఆధికారులను ఆదేశించారు.వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీ రిజ్వీ, జి.హెచ్.యం.సి కమీషనర్ శ్రీ లోకేశ్ కుమార్, మున్సిపల్ పరిపాలన కమీషనర్ మరియు డైరెక్టర్ శ్రీ యన్.సత్యనారాయణ, పోలీసు కమిషనర్ శ్రీ అంజనీ కుమార్, ఆర్ధిక శాఖ స్పెషల్ సెక్రటరీ శ్రీ రోనాల్డ్ రోస్, టిఎస్ఐఐసి ఎండి శ్రీ నర్సింహారెడ్డి, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ శ్రీ రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *