TT Ads

ఖమ్మం : వివిధ కుల, ప్రజా సంఘాలు బలపరిచిన 50వ డివిజన్ స్వతంత్ర అభ్యర్థి కోయిన్నీ వెంకన్న శనివారం డివిజన్లో విస్తృత ప్రచారాని నిర్వహించి పెవిలియన్ గ్రౌండ్ సమీపంలో మున్సిపల్ కార్పొరేషన్ ఐదు రూపాయలకు అందజేస్తున్న మధ్యాహ్నం రోడ్డు పక్క సాదాసీదా భోజనాన్ని స్వీకరించారు . తొలుత డివిజన్లో తాను గెలిస్తే ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానో , ఒకవేళ తాను అభివృద్ధి కార్యక్రమాల అమలులో విఫలం అయితే తనను ప్రశ్నించడమే కాకుండా తన మీద కేసు వేయవచ్చు అని , పేరుకుంటూ రూపొందించిన ఎన్నికల హామీ పత్రాన్ని ఇంటింటికి తిరిగి అందజేశారు . తన ఎన్నికల గుర్తు బ్యాట్ను ప్రదర్శిస్తూ, కోయిన్నీ వెంకన్న ఎన్నికల ప్రచారం నిర్వహించారు . పేద ప్రజల పెన్నిధిగా , పేద ప్రజల సమస్యల పరిష్కార కర్తగా కోయిన్నీ వెంకన్న ఇప్పటికే ప్రాచుర్యం పొందారు . రోడ్డు పక్క సాదాసీదా భోజనాన్ని ఆరగించిన కోయిన్నీ వెంకన్న బృందం అందరికీ ఆదర్శంగా స్ఫూర్తిదాయకంగా నిలిచింది . ఈ ప్రచార కార్యక్రమంలో వివిధ కుల , ప్రజాసంఘాల నాయకులు డాక్టర్ కె .వి. కృష్ణారావు , బానోతు బద్రు నాయక్ , సోమరాజు, గరిడేపల్లి సత్యనారాయణ , నాగరాజు, వీరన్నా , రాము , నాగేశ్వరావు రాజు , ప్రసాద్ , వరలక్ష్మి , ఉపేంద్ర , స్వాతి తదితరులు పాల్గొన్నారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *