TT Ads

ఖమ్మం: ప్రభుత్వం పేద ప్రజలకు సబ్సిడీగా అందిస్తున్న రేషన్ బియ్యాన్ని రేషన్ దుకాణాలు నుండి తక్కువ ధరలకు సేకరించి అధిక ధరలకు విక్రయించేందుకు రవాణా చేస్తునట్లు అందిన సమాచారంతో ఈరోజు తెల్లవారుజామున టాస్క్ ఫోర్స్ ఏసీపీ రామానుజం, సిఐ రవికుమార్,ఎస్సై ప్రసాద్, కొణిజర్ల పోలీసులు తమ సిబ్బందితో కలసి కొణిజర్ల మండలం పల్లిపాడు గ్రామంలోని మారుతీ రైస్ మిల్ లో సోదాలు నిర్వహించారు.

చుట్టుపక్కల గ్రామాల నుండి సేకరించిన పిడిఎస్ బియ్యాన్ని పాలిష్ చేసి అక్రమంగా తరలించేందుకు లారీలో లోడు చేసేందుకు సిద్ధంగా వున్న 160 బస్తాలు (సుమారు 80 క్వింటాల్స్) బియ్యాన్ని స్వాధీనంచేసుకున్నట్లు ఏసీపీ తెలిపారు. రైస్ మిల్లు అపరేటర్ ఎస్.డి. ఖాసిమ్ సాహెబ్, రేషన్ బియ్యం సేకరించాడానికి సహకారిస్తున్న సత్తు లక్ష్మయ్య తో పాటు నాలుగు ద్విచక్ర వాహనాలు, ఆశోక్ లైలాండ్ మినీ ట్రక్, రేషన్ బియ్యం స్వాధీనం చేసుకొన్నట్లు ఏసీపీ తెలిపారు.

తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం కొణిజర్ల పోలీస్ స్టేషన్ లో అప్పగించారు.సమీప గ్రామాల నుండి రేషన్ బియ్యాన్ని సేకరిస్తున్న దిద్దూపూడి గ్రామానికి చెందిన మక్కల్ నరసింహారావు,పల్లిపాడు గ్రామానికి చెందిన రైస్ మిల్లు యజమాని రాంపూడి నాగేశ్వరరావు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలిపారు. తనిఖీల్లో టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్ రామారావు, కలింగ రెడ్డి, హమీద్ పాల్గొన్నారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *