TT Ads

రాష్ట్రంలో కరోనా మరణాలు, వ్యాధి రోజురోజుకు విజృంభించడంతో వెంటనే కరోనా వ్యాధి చికిత్సను ఆరోగ్య శ్రీ లో చేర్చి ప్రతి పేదవారికి ఆరోగ్యం అందించాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఉదయం హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద ఆమరణ నిరాహారదీక్ష చేపట్టిన కాంగ్రెస్ ములుగు ఎమ్మెల్యే సీతక్క, ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ ల ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఈరోజు మధ్యాహ్నం వారి దీక్ష భగ్నం చేసి ఆస్పత్రికి తరలించారు. .. ఈ సందర్భంగా పోలీసులకు ఆందోళనకారులకు వాగ్వాదం తోపులాట జరగడంతో కొద్దిసేపు ఇందిరాపార్కు ధర్నా చౌక్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది బలవంతంగా పోలీసులు ఎమ్మెల్యే సీతక్క రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ ను అంబులెన్సు లో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు మిగతా వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *