TT Ads

అనంతపురం: రాప్తాడు మండలం బొమ్మెపర్తి గ్రామంలో సోమవారం ఓ రైతు ఇంట్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. గ్రామానికి చెందిన రైతు విశ్వనాథరెడ్డి ఇంట్లో ఉన్న రూ. 6 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ డబ్బులు ద్రాక్ష పంట అమ్మితే వచ్చినవి అంటూ బాధిత రైతు రాప్తాడు ఎస్ఐ ఆంజనేయులు దృష్టికి తీసుకువెళ్లాడు. కానీ ఎస్‌ఐ ఆంజనేయులు రైతు పట్ల దురుసుగా ప్రవర్తించి ఈ డబ్బుకు సంబంధించిన ప్రింటెడ్ ఆధారాలు చూపించాలంటూ వేధించాడని సమాచారం. ఈ చర్యల పట్ల విశ్వనాథ రెడ్డి కుటుంబ సభ్యులు తీవ్రమైన ఆందోళన చెందుతున్నారు. పోలీసుల తీరుపై బొమ్మెపర్తి గ్రామస్థులు, రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *