TT Ads

రాజు డాక్టర్ ఇకలేరు….రాజంపేట వాసులకు సుపరిచితులు, ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ రాజు (కే ఎస్ అర్) ఈరోజు తెల్లవారు జామున ఒంటిగంట ప్రాంతంలో తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. ఇటీవల డాక్టర్ రాజు అనారోగ్యం భారిన పడి స్విమ్స్ లో వైద్యం పొందుతుండే వారు. ఇదిలా ఉంటే రాజంపేట ప్రాంతంలో ఏమాత్రం వైద్యసేవలు అందుబాటులో లేని సమయంలో డాక్టర్ రాజు ప్రజలకు అతి తక్కువ ఫీజు తో వైద్య సేవలు అందించే వారు. ఇక పేదలకు ఉచితంగా వైద్యసేవలు అందించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వైద్యం కోసం వచ్చే నిరుపేదలకు ఉచితంగా వైద్యం చేయడంతో పాటు నగదు కూడా సహాయం చేసేవారు. దీంతో ఆయన పేదల డాక్టర్ గానే కాక, మంచి మనసున్న మానతా వాదిగా కూడా ప్రజల మనసుల్లో చెరిగిపోని ముద్ర వేసుకున్నారు. ఇదిలా ఉంటే ఆర్డీవో కార్యాలయం పక్కన కసిరెడ్డి వెంకటసుబ్బారెడ్డి నగర్ లో వెలసి ప్రసిద్దిగాంచిన వరసిద్ది వినాయక స్వామి ఆలయ నిర్మాణానికి తొలుత కృషి చేసిన వ్యక్తి డాక్టర్ రాజు కావడం విశేషంగా చెప్పవచ్చు. డాక్టర్ రాజుకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. డాక్టర్ రాజు అంత్యక్రియలను రాజంపేట మండలం మునక్కాయ పల్లె లో ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు నిర్వహించనున్నట్లు సమాచారం.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *