TT Ads

సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజినీకాంత్ కి ఉన్న ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిందే. కేవలం దక్షిణాది చిత్ర పరిశ్రమలోనే కాదు. ఉత్తరాది పరిశ్రమ అయిన బాలీవుడ్ ఇండ్రస్టీలో కూడా రజినీకాంత్ కి మంచి ఫ్యాన్ బేస్ ఉంది. అక్కడ ఆయనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. రజనీ సినిమా వస్తుందంటే స్టార్ హీరోలు సైతం క్యూ కడుతారు.ఆయన చేసిన సినిమాలకు తోడు.సామాజిక సేవ కార్యక్రమాలు రజనీకాంత్ ను ఓ స్థాయిలో నిలబెట్టేశాయి.

తాజాగా, సూపర్ స్టార్ రజనీకాంత్ కు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక ‘దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు’ ను ప్రకటించింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి ప్రకాశ్ జావదేకర్ తన ట్విట్టర్ ఖాతాలో స్వయంగా ప్రకటించారు. ‘ఇండియన్ సినిమా రంగంలో అత్యున్నత నటుల్లో ఒకరైన రజనీకాంత్ గారికి ఈ సంవత్సరం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును అందించనున్నాము. ఓ నటుడిగా, నిర్మాతగా స్క్రీన్ రైటర్ గా చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవలు అద్భుతం. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చాలా సంతోషిస్తున్నాను’ అంటూ మంత్రి ప్రకాశ్ జావదేకర్ వెల్లడించారు. రజనీకాంత్ ప్రస్తుతం శివ దర్శకత్వంలో అన్నాత్తే చిత్రంలో నటిస్తున్నారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *