TT Ads

సినీ ఇండస్ట్రీలో మహిళలపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయనే విషయం ఎప్పటినుంచో వింటూనే ఉన్నాం. ఇప్పటికే ఎంతోమంది నటీమణులు తమ గోడు వెలిబుచ్చుకున్నారు. కాస్టింగ్ కౌచ్ పేరుతో లైంగిక దోపిడీ చేస్తున్నారంటూ ఆవేదన చెందారు. మరోవైపు రియల్ లైఫ్ లోనూ నటీమణులు వేధింపులకు గురికావడం అక్కడక్కడా చూస్తూనే ఉన్నాం. తాజాగా తనకు అలాంటి ఓ చేదు అనుభవం ఎదురైందని, దాని తాలూకు వివరాలు చెబుతూ ఎమోషనల్ అయ్యింది సినీ నటి ఫాతిమా సనా.ఓ సారి తాను జిమ్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా ఓ వ్యక్తి తన వైపు అదేపనిగా చూడడం, వెంట రావడం గమనించానని, అప్పటికే అతడు కాస్త తేడాగా అనిపించడంతో ‘ఎందుకు నన్ను ఫాలో అవుతున్నావు.. ఏం చూస్తున్నావు’ అని ప్రశ్నించానని.. అయితే ‘నా ఇష్టం నేను చూస్తాను’ అని అతను సమాధానమివ్వడంతో కోపం వచ్చి చెంప పగలగొట్టానని ఫాతిమా చెప్పింది. దీంతో అతను కూడా వెంటనే ఒక్క పంచ్ ఇచ్చి గుద్దడంతో ముందుకు పడిపోయానని.ఆ సమయంలో ఏమీ అర్థం కాలేదని తర్వాత వెంటనే తేరుకుని తన తండ్రికి ఫోన్ చేయడంతో అతను పారిపోయాడని ఆమె చెప్పుకొచ్చింది.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *