TT Ads

కార్మికుల, వారి కుటుంబాలకు ఆరోగ్య సమస్యలు పరిష్కారం కు ప్రాధాన్యత,రాష్ట్రంలో ని 78 ఈఎస్ఐ డిస్పెన్సరీ లలో త్వరలో ఆన్లైన్ సేవా విధానం-మంత్రి జి.జయరామ్.

రాష్ట్రంలో 2,434 వైద్య సేవలు ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ కింద రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కార్మికుల సంక్షేమం కోసం, ఆరోగ్య భద్రత కల్పించాలనే సంకల్పంతో ఉందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్ అన్నారు.

సోమవారం విజయవాడలో ని మోడల్ ఈఎస్ఐ డిస్పెన్సరీ లో ఆన్ లైన్ విధానాన్ని మంత్రి జయరామ్, ముఖ్య కార్యదర్శి బి. ఉదయరాణి లు ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి జయరామ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో సంక్షేమం తో పాటు విద్య కు, ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. స్వర్గీయ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఆరోగ్యశ్రీ పథకం అమలు చేసి, ప్రజల హృదయ ల్లో చిరస్థాయిగా నిలిచారన్నారు. ఆయన వారసుడు గా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కింద 2434 వైద్య సేవలను అందిస్తోందన్నారు. ఆరోగ్యం బాగుంటేనే రాష్ట్రం అభివృద్ధి లో కూడా ముందు ఉంటుందని సీఎం నమ్మకంతో ఆరోగ్యానికి పెద్ద పీట వేశారని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో తొలిసారిగా ఈ ఎస్ ఐ డిస్పెన్సరీ ని ఆన్లైన్ చెయ్యడం జరిగిందని, తద్వారా వారి ఆరోగ్యానికి భరోసా ఇచ్చారన్నారు. గత ప్రభుత్వం హయాంలో ఆరోగ్యశ్రీ పూర్తిగా నిర్వీర్యం చేశా రని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 78 ఈ ఎస్ ఐ డిస్పెన్సరీ లను త్వరలోనే ఆన్లైన్ కిందకు తీసుకుని రావడం జరుగుతుంది అని తెలిపారు. వైద్య సేవలు కోసం వొచ్చే కార్మికులు, వారి కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా పలకరించి వైద్య సేవలు అందించాలని కోరారు. రాష్ట్రంలో రెండు కోట్ల 50 లక్షల మంది కార్మిక కుటుంబాలకు చెందిన వారు ఉంటారని మంత్రి జయరామ్ తెలిపారు. ఈ ఏస్ ఐ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు, చికిత్సలు అందిస్తున్నారన్నారు. ఆరోగ్య శ్రీ ద్వారా ఐదు లక్షల రూపాయల వైద్య సేవలను ప్రభుత్వం ఉచితంగా అందిస్తోందన్నారు.

ముఖ్య కార్యదర్శి బి. ఉదయరాణి మాట్లాడుతూ, ఈ ఏస్ ఐ చరిత్ర లో ఈ రోజు శుభదినం అన్నారు. ఈ విజయవాడ పరిధిలో 43 వేలమంది కార్మికుల, వారి పై ఆధారపడిన లక్ష 50 వేల మంది కుటుంబ సభ్యులకు ఈఏస్ఐ భీమా కింద వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ఆన్లైన్లో నమోదు చేసుకుని, కార్మికులు వారి సమయాన్ని ఆదాచేసు కోవొచ్చని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ధన్వంతరి పధకాన్ని రాష్ట్రంలో ని 78 ఈఎస్ఐ ఆసుపత్రిలో, 4 ఈఎస్ఐ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలల్లో అమలు చెయ్యడం జరుగుతుందన్నారు. వైద్య సేవలు అందించే ప్రక్రియ ను ఆన్లైన్ లో నమోదు చెయ్యడం వల్ల వారి ఆరోగ్య డేటా ను భద్రపరచడం చేస్తామన్నారు. మెడికల్ సర్టిఫికెట్ జారీ, తమకు నచ్చిన డాక్టర్ ద్వారా అనుకున్న సమయంలో వైద్యం చేసుకోవచ్చు నని అన్నారు.

ఈ సమావేశంలో డైరెక్టర్ ఎల్ ఎస్బియర్ కుమార్ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ప్రవల్లిక, ప్రాంతీయ సంచాలకులు వి.కాశీ నాథన్, జేడీ(భీమా) డా.జి.జగదీష్ గాంధీ, జేడీలు డా.చంద్రశేఖర్, డా.బి. రవికుమార్, మెడికల్ సూపరింటెండెంట్ లు, ఈఎస్ఐ డాక్టర్లు, నర్సులు, సిబ్బంది, ఈఎస్ఐ చందాదారులు తదితరులు పాల్గొన్నారు.తొలుత ఈఎస్ఐ డిస్పెన్సరీ ఆన్లైన్ సేవలు విభాగాన్ని మంత్రి ప్రారంభించి, అక్కడ ఆమెకు చేస్తున్న సేవలను పరిశీలించారు. అనంతరం బిపి ని చెక్ చేయించుకున్నారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *